నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి హరికృష్ణ తనయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో హీరోగా మారారు.   ఆ తర్వాత వరుసగా వచ్చిన చిత్రంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ అప్పట్లో బొద్దుగా ఉండే వారు.  మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ‘యమదొంగ’ చిత్రంలో సన్నగా కరెంటు తీగలా మారిపోయాడు.  అంతే కాదు ఈ చిత్రంలో అచ్చం తాతను పోలినట్లుగా కనిపించడం మరో విశేషం.
Image result for jr ntr ramayanam
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజంటే అభిమానులకు పండగే. తమ అభిమాన కథానాయకుడి పుట్టిన రోజును ఎంతో ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అనుకుంటారు ప్రతి అభిమాని.  కాగా, వచ్చే నెల 20 వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్న ఎన్టీఆర్ కు అభిమానులు నెల ముందే ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇంతకి ఆ సర్‌ప్రైజ్ ఏంటంటే.. ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాల్లోని పాత్రలతో ఓ 35 పేజీల పుస్తకాన్ని తయారు చేశారు. 
Related image
ట్విస్ట్ ఏంటంటే..ఈ పుస్తకాన్ని రోజుకు ఒక పేజీ చొప్పున 35 రోజుల పాటు విడుదల చేయనున్నారు. మొదటి చిత్రం 'బాల రామాయణం' లోని ఎన్టీఆర్‌ పోస్టర్‌ను.. సినిమా వివరాలను సంక్షిప్తంగా తొలి పోస్టర్‌లో పంచుకున్నారు.  వాస్తవానికి ఎన్టీఆర్ మహానటులు సీనియర్ ఎన్టీఆర్  స్వీయ దర్శకత్వంలో "బ్రహ్మర్షి విశ్వామిత్ర" తో తొలిసారి తెరంగేట్రం చేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణంలో రాముడిగా కనువిందు చేసిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: