తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న హీరో నాని.  ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తర్వాత మనోడికి వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది.  వరుసగా హిట్స్ మీద హిట్స్ కొడుతూ మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోడు.  అంతే కాదు ఈ మద్య ‘అ!’ చిత్రంతో నిర్మాతగా కూడా మారాడు నాని.  ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా 'కృష్ణార్జున యుద్ధం' రూపొందింది. నాని ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ .. రుక్సార్ మీర్ కథానాయికలుగా అలరించనున్నారు.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్  సొంతం చేసుకొని నేడు థియేటర్లో సందడి చేస్తుంది. మేర్లపాక గాంధీ గతంలో చేసిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాలు ఘన విజయాలను సాధించడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.  నాని డిఫరెంట్ లుక్స్ .. 'హిపాప్ తమిళ' సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.   అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రిమియం షోలో కొన్ని చోట్ల పడ్డాయి.   
Image result for నాని కృష్ణార్జున యుద్దం ప్రీమియం
ప్రిమియం టాక్ షో ని బట్టి చూస్తే..చిత్రం రెండు వైవిధ్యమైన పాత్రలతో పూర్తి తరహా ఎంట్ర టైన్ మెంట్, లవ్ ట్రాక్ తో నడుస్తున్నట్లు తెలుస్తుంది.  పల్లెటూరి కుర్రాడి పాత్రలో కృష్ణ..రాక్ మ్యూజిక్ స్టార్ గా ప్లే బాయ్ గా అర్జున్ పాత్రలు రెండు వైవిధ్యంగా చూపించారు దర్శకులు.  ఇక హీరోయిన్ల విషయానికి వస్తే..అనుపమ పరమేశ్వరన్..రూఖ్సర్ దిలన్ ఇద్దరూ పోటీ పడి నటించారు. 
Related image
ఇక గ్లామర్ పరంగా చూస్తే రూఖ్సర్ కాస్త హాట్ హాట్ గానే కనిపించింది. సినిమా అంతే నాని రెండు పాత్రలపైనే తిరుగుతుంది...చిత్తూరు లోని ఓ పల్లెటూరు..యూరప్ నేపథ్యంలో సినిమా సాగుతుంది.  రెండు పాత్రల్లో నాని బాగానే మెప్పించాడు. మ్యూజిక్..ఫ్యూజువల్స్,ఫోటో గ్రఫి పరవాలేదు అనిపించింది.  అర్జున్ పాత్రలో నాని చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. 

ఇద్దరు కుర్రాళ్లు ప్రేమలో పడటం..బ్రేకప్ కావడం..తిరిగి వారిని వెతికే పనిలో ఏన్ని ఇబ్బందులు పడ్డారు అన్న విషయంపై దర్శకులు తన ప్రతిభ చూపించారు. నేచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..అనుపమ, రూఖ్సర్ పరవాలేదు అనిపించుకున్నారు. 'హిపాప్ తమిళ' బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అపినించాడు.  మొత్తానికి సాయంత్ర వరకు వచ్చే రిజల్ట్ ని బట్టి సినిమా హిట్టా..ఫట్టా అన్న విషయం తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: