సినీ పరిశ్రమలో అద్భుతమైన సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు. తాజాగా రంగస్థలం సినిమా ఆయనకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది.  ఇప్పటి వరకు రత్నవేలు సినిమాలు ఎన్నో వచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు..కాకపోతే అవన్నీ సూపర్ హిట్ అయిన సినిమాలే. సుకుమార్ దర్శకత్వం, చరణ్ నటన, సమంత హావభావాలతో పాటు రత్నవేలు సినిమాటోగ్రఫీ పనితీరును టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో మెచ్చుకుంటున్నారు.

శంకర్ దర్శకత్వంలో రోబో, సుకుమార్‌తో ఆర్య, 1 నేనొక్కడినే, కుమారి 21ఎఫ్, వినాయక్‌తో ఖైదీ నంబర్ 150, తాజాగా రంగస్థలం సినిమా ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి.చిరంజీవితో రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సైరా నర్సింహారెడ్డి చిత్రానికి సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు డైరెక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేదని కాకపోతే ఇద్దరు స్టార్ హీరోలు తనకు అడ్డు చెప్పారని అన్నారు. దర్శకుడిగా మారాలనే కోరిక వెంటాడుతున్నది.

నా వద్ద ఓ కథ మొత్తం బౌండ్ స్క్రిప్ట్‌గా ఉంది. కానీ సినిమాకు దర్శకత్వం వహించడానికి సమయం దొరకడం లేదు. గతంలో 1 నేనొక్కడినే చిత్రం తర్వాత డైరెక్షన్ చేయాలని నిర్ణయించుకొన్నాను. ‘లింగ’ సినిమాకు రత్నవేలును సినిమాటోగ్రఫీ చేయాలని రజినీకాంత్ పట్టుబట్టారట. అందుకే దర్శకత్వం వహించాలన్న తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు రత్నవేలు తెలిపారు. ఆ సమయంలో రజినీకి తన కోరిక చెప్పడంతో..‘ఇప్పుడెందుకు తొందర.. 50 ఏళ్లు వచ్చేవరకు సినిమాటోగ్రఫీనే చేయండి.
Image result for రత్నవేలు
ఆ తర్వాత డైరెక్షన్ గురించి ఆలోచించండి’ అని తమిళ సూపర్ స్టార్ సలహా ఇచ్చారట. ఆ తర్వాత రంగస్థలం సినిమా తర్వాత రత్నవేలుకు మళ్లీ డైరెక్షన్ చేయాలనే కోరిక కలిగిందట. కానీ, ఆ సినిమా పూర్తైన వెంటనే ‘సైరా’ తర చేతికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
Image result for chiru rajini
‘చిరంజీవి, రాంచరణ్ ఒత్తిడి మేరకు డైరెక్షన్ చేయాలనే కోరికకు మరోసారి బ్రేక్ పడింది. తనకు సినిమాటోగ్రాఫర్లలో రాజీవ్ మీనన్, సంతోష్ శివన్ అంటే చాలా ఇష్టం. రాజీవ్ మీనన్ వద్ద తాను అసిస్టెంట్‌గా చేరి ఇండస్ట్రీలోకి వచ్చాను. రాజీవ్ మీనన్ చాలా గొప్ప దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అని రత్నవేల్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: