నేడు 65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను అధికారికంగా ప్రకటించారు.  జ్యూరీకి నాయకత్వం వహిస్తున్న దర్శకుడు శేఖర్ కపూర్ ఈ అవార్డులను ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో ప్రకటించారు.  అయితే ఈ జాతీయ అవార్డులు తెలుగు చిత్రాలకు బాగానే లభించాయి. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రానా నటించిన ‘ఘాజీ’  బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు దక్కింది. ఇదే సమయంలో 'బాహుబలి-2'కి మూడు అవార్డులు లభించాయి.
Image result for ఘాజీ చిత్రం
బాహుబలి,బాహుబలి 2 చిత్రాలు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించాయి. ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం గొప్ప పేరు తెచ్చకుంది.  అంతే కాదు బాహుబలి 2 భారతీయ చలన చిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో నటించిన నటులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.  తాజాగా 65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డుల బాహుబలి విషయంలో పొరపాటు జరిగినట్లు ఆ చిత్ర యూనిట్ తెలుపుతుంది. 
Image result for action director peter baahubali
బాహుబలి ది కంక్లూజన్ యాక్షన్ డైరెక్టర్ అబ్బాస్ అలీ మొఘల్‌ను బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా జ్యూరీ ప్రకటించింది. ‘బాహుబలి’ యాక్షన్ డైరెక్టర్ విషయంలో పెద్ద తప్పే జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు? ఆయన అసలు బాహుబలి-1 లేదంటే 2కి పని చేయలేదు’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అసలు ‘బాహుబలి’కి యాక్షన్ డైరెక్టర్‌గా పీటర్ హెయిన్ పని చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: