‘మహానటి’ సావిత్రి జీవితం పై నిర్మిస్తున్న ‘మహానటి’ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక టాప్ హీరో సినిమా టీజర్ కు వచ్చే స్పందన స్థాయిలో ఈటీజర్ కు లక్షల సంఖ్యలో హిట్స్ రావడంతో ఈమూవీ సైలెంట్ బ్లాక్ బస్టర్ గా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సావిత్రి లా  కీర్తి సురేష్ ఈపాత్రలో పరకాయ ప్రవేశం చేసింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
MAHANATI MOVIE TEEJAR PHOTOS కోసం చిత్ర ఫలితం
‘డాక్టర్ చక్రవర్తి’ రిలీజ్ అయినప్పుడు టికెట్లు దొరక్క ప్రేక్షకులు వెనక్కు వెళ్ళిపోయే సీన్ ని ఒక షాట్ లో చూపెట్టి ఆరోజులలో సావిత్రి క్రేజ్ ఏస్థాయిలో ఉండేదో దర్శకుడు నాగ్ అశ్విన్. వ్యూహాత్మకంగా ఈ టీజర్ లో వ్యవహరించాడు. అయితే ఇంత అద్భుతమైన ఈమూవీ మేకింగ్ వెనుక జరిగిన రిసర్చ్ వర్క్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలను హైలెట్ చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 
MAHANATI MOVIE TEEJAR PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమాలో సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేశ్ కు సావిత్రిని గుర్తుకు చేసుకునే విధంగా నాలుగు రకాల బొట్లు వాడినట్లు తెలుస్తోంది. అప్పట్లో సావిత్రి కట్టిన చీరాల పై దాదాపు పదిమంది సారీ డిజైనర్స్ తో లోతైన రీసర్చ్ చేయించడమే కాకుండా ముంబాయ్ నుండి స్పెషల్ ఫ్యాబ్రిక్ ను తెప్పించి 100కు పైగా చీరలను ఈసినిమా కోసం డిజైన్ చేయించారట. ఇక ‘మాయాబజార్’ ఘట్టంలో వచ్చే సావిత్రి చీరకోసం మూడు నెలల సమయం తీసుకున్న ఈ టీమ్ సావిత్రి వంకీల జుత్తు గుర్తుకు తెచ్చే విధంగా చెన్నై నుంచి స్పెషల్ హెయిర్ స్టైలిస్ట్ ల సహకారంతో సవరాలు తెప్పించినట్లు తెలుస్తోంది. 
MAHANATI MOVIE TEEJAR PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమాలో ‘మాయాబజార్’ సినిమాను గుర్తుకు చేసుకోవడానికి గతంలో ఆసినిమాలో వాడిన విధంగా బెనారస్ చీరలను కర్టేన్స్ బెడ్ కవర్స్ గా వాడినట్లు తెలుస్తోంది. సావిత్రి కాలంనాటి కెమెరాలు గ్రామ్ ఫోన్ లు ఇలా ఈకాలం వారికి తెలియని ఎన్నో వస్తువులను ఈసినిమాలో చూపించబోతున్నారు. అయితే ఎంతో శ్రమతో భారీ బడ్జెట్ తో ఈసినిమాను తీస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి నిజ జీవితంలోని చివరి ఘట్టాలకు సంబంధించిన వాస్తవ విషయాలు చూపించకుండా ఈసినిమాను ముగిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ ‘మహానటి’ జీవితంలోని చీకటి కోణాలను చూపించకుండా కేవలం వెలుగు కోణాలను మాత్రమే చూపెడుతూ ముగించబోయే ఈమూవీ సామాన్య ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించగలదు అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్..  



మరింత సమాచారం తెలుసుకోండి: