టాప్ యంగ్ హీరోల సమ్మర్ రేసులో వచ్చేనెల మొదటివారంలో విడుదల కాబోతున్న ‘నా పేరు సూర్య’ పై అంచనాలు ఎలా ఉన్నా ఇప్పటికే ‘రంగస్థలం’ క్రియేట్ చేసిన రికార్డులను వచ్చేవారం ‘భరత్ అనే నేను’ మూవీ చేయబోయే సంచలనాలను మించి అంచనాలు అందుకోగలిగితేనే బన్నీ ఈ ఏడాది సమ్మర్ రేస్ స్టార్ గా గుర్తింపు పొందుతాడు. అయితే బన్నీకి ఉన్న క్రేజ్ రీత్యా ‘నా పేరు సూర్య’ కు అత్యంత భారీస్థాయిలో బిజినెస్ జరిగింది. 
సంబంధిత చిత్రం
గతంలో అల్లు అర్జున్ సినిమాలు భారీ విజయాలు అందుకున్న ప్రతి సందర్భంలోను ఆసినిమాలలోని ఆడియో కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు ఈ అల్లువారి అబ్బాయి నటించిన ప్రతి సినిమాలోని పాటలు విపరీతంగా ఆసినిమా విడుదలకు ముందే హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 
NAA PERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే దీనికి భిన్నంగా ‘నా పేరు సూర్య’ ఆడియోలోని ఇప్పటివరకు విడుదలైన ఏ పాట కూడ క్యాచీ ట్యూన్ తో లేకపోవడంతో ఈపాటలు పెద్దగా యూత్ కు కనెక్ట్ కాలేదు. దీనికితోడు ఈసినిమాకు సంగీత దర్శకత్వం వహించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ శేఖర్ తెలుగు మాస్ ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడంలో విఫలం అయ్యాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
NAA PERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ఆడియో పరంగా ఈసినిమాను రక్షించే ఆఖరి ప్రయత్నంలో ఒక మాస్ సాంగ్ ను ఈవారంలో ఈసినిమా యూనిట్ వర్గాలు విడుదల చేయబోతున్నాయి. మంచి మాస్ బీట్ తో ఉండే ఈపాట ‘నా పేరు సూర్య’ పై బన్నీ అభిమానులు పెట్టుకున్న అంచనాలను నిజం చేసే విధంగా ఉంటుంది అని అంటున్నారు. తొలిసారి వక్కంతం వంశీ ఒక దేశభక్తి కథతో తీస్తున్న ఈసినిమాలోని పాటలు ఇంకా జనంమధ్యకు పూర్తి హిట్ సాంగ్స్ గా వెళ్ళలేకపోవడంతో ఈమూవీ బయ్యర్లతో పాటు అల్లుఅర్జున్ కూడ కలవర పడుతున్నట్లు టాక్. మరి ఈ ఆఖరి ప్రయత్నం సూర్యను ఎంతవరకు రక్షిస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: