తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు భద్రత లేకుండా పోతుందని...క్యారెక్టర్స్ ఇప్పిస్తామని చెప్పి అమ్మాయిలను దారుణంగా వాడుకుంటున్నారని..కాస్టింగ్ కౌచ్ పై గత నెల రోజుల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తుంది..శ్రీశక్తి (శ్రీరెడ్డి).  తనకు అన్యాయం అవుతుందని ఏకరువు పెట్టుకున్నా..ఎవ్వరూ పట్టించుకోలేదని..పైగా తననే దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఈ మద్య ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసిన తర్వాత ఈ విషయాన్ని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా సీరియస్ గా తీసుకొని శ్రీశక్తి (శ్రీరెడ్డి) మద్దతు పాలికారు.  అంతే కాదు శ్రీశక్తి (శ్రీరెడ్డి) ఇండస్ట్రీలో కొంత మంది ఫోటోలు తన ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడంతో విషయం కాస్త సీరీయస్ గా మారింది.  తాజాగా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మహిళా సంఘాల ప్రతినిధులు చర్చ వేదికను ప్రారంభించారు.

ఈ సందరర్భంగా అపూర్వ మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు పోరాడుతామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఆమె ప్రకటించారు. తాము మాట్లాడుతుంటే కొందరు అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నది ఉన్నట్టుగా తాము మాట్లాడుతుంటే, కొందరు తమను అవహేళన చేస్తున్నారని, తమకు మద్దతుగా నిలవకపోయినా ఫర్వలేదుగానీ, అనవసర వ్యాఖ్యలు చేయొద్దని కోరింది.

కాగా, సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక హింసను కూడా ఆమె ప్రస్తావించింది. ఆవేదనతో..కడుపు మండి బాధను చెప్పుకుంటే..అవహేళన చేస్తున్నారని.. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు... ఇలా అనవసర కామెంట్లు చేయొద్దని సూచించారు. వెయ్యి రూపాయల కోసం నలుగురితో పడుకోవాల్సిన అవసరం లేదని అపూర్వ ఆవేదన వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: