మెగా బ్రదర్స్ లో నాగబాబు పాత్ర అత్యంత కీలకం. చిరంజీవి పవన్ ల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు కూడ నాగబాబు చిరంజీవి పక్షాన నిలబడి తన స్ట్రాటజీని బయటపెట్టాడు. గతంలో చిరంజీవి పాల్గొనే ఫంక్షన్స్ లో పవన్ అభిమానులు పవన్ కోసం హడావిడి చేసినప్పుడు పవన్ అభిమానుల పై తన అసహనాన్ని వ్యక్తపరిచి పవర్ స్టార్ అభిమానులతో అనుకోని వైరాన్ని కూడ సృష్టించుకున్నాడు. 
NAGABABU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అలాంటి నాగబాబు ఇప్పుడు చిరంజీవికి దూరంగా జరుగుతున్నాడా అన్న అనుమానాలను కొందరు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తపరుస్తున్నారు. దీనికికారణం మెగా ఫ్యామిలీ ఇమేజ్ ని నిలబెట్టిన ‘రంగస్థలం’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కానీ ఆతరువాత జరిగిన ఈమూవీ సక్సస్ మీట్ లో కానీ నాగబాబు ఎక్కడా కనిపించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. 
RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి ఏఫంక్షన్ జరిగినా నాగబాబు లేకుండా జరిగిన నేపధ్యం గతంలో లేదు. అయితే అనూహ్యంగా మారిన పరిస్థుతులలో పవన్ కళ్యాణ్ తిరిగి చిరంజీవి దగ్గర కావడం అదేవిధంగా పవన్ చరణ్ ల మధ్య పెరిగిపోయిన ప్రేమను చూసి నాగబాబు షాక్ అయ్యాడా ? అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలకు దూరం అయినా తన వారసుడుగా రామ్ చరణ్ ను ప్రొజెక్ట్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు రాబోతున్న ఎన్నికల సమరంలో డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా పవన్ తన అన్న చిరంజీవి సలహా సంప్రదింపులు తీసుకోవాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు తన అభిమానులు అందరు చెల్లాచెదురు అయిపోకుండా వారందరినీ చరణ్ అభిమానులుగా మార్చే ప్రయత్నాలు కూడ జరుగుతున్నాయని టాక్. దీనితో ఊహించని వేగంతో మెగా ఫ్యామిలీలో మారుతున్న స్ట్రాటజీలను నాగబాబు నిశితంగా పరిశీలిస్తూ తన కొడుకు వరుణ్ తేజ్ కెరియర్ గురించి తన బుల్లితెర కార్యక్రమాల గురించి ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: