నిన్న మహేష్ ‘భరత్ అనే నేను’ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. యాక్షన్ డోస్ కూడా ఉంది కాబట్టి ఈమూవీకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ రన్ టైమ్ 173 నిమిషాలు వచ్చింది అని తెలుస్తోంది. దాదాపు మూడుగంటల ఈసినిమాకు సెన్సార్ బోర్డ్ వర్గాలు ఒక్క సింగిల్ కట్ కూడ వేయకుండా ఈమూవీని సెన్సార్ చేసారని తెలుస్తోంది. 
BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ‘భరత్ అనే నేను’ అవుట్ అండ్ అవుట్ మహేష్ వన్ మ్యాన్ షోగా మారింది అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ చాలా డిగ్నిఫైడ్ గా కనిపించాడని తెలుస్తోంది. ‘శ్రీమంతుడు’ కన్నా ఎన్నోరెట్లు ఎంటర్ టైన్మెంట్ ఇందులో ఉంటుందని సెన్సార్ వర్గాలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమూవీకి సెన్సార్ పూర్తి కావడంతో సెన్సారు టాక్ అంటూ రకరకాల వదంతులు అప్పుడే సందడిచేయడం మొదలైపోయింది. 
సంబంధిత చిత్రం
వాస్తవానికి ‘రంగస్థలం’ సెన్సార్ తరువాత ఇటువంటి వదంతులు ఏమీ రాకపోవడంతో ‘రంగస్థలం’ విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తో విడుదలైంది. అయితే ఇప్పుడు ‘భరత్ అనే నేను’ మూవీకి అప్పుడే నెగిటివ్ ప్రచారం ప్రారంభంకావడంతో ఈనెగిటివ్ ప్రచారానికి మహేష్ పిఆర్ టీమ్ సరైన అడ్డుకట్ట వెంటనే సోషల్ మీడియాలో వేయకపోతే ‘భరత్ అనే నేను’ ఇరుకున పడే ఆస్కారం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. మహేష్ ‘స్పైడర్’ సినిమా విషయంలో విపరీతంగా జరిగిన నెగిటివ్ ప్రచారం పరిస్థుతులు మళ్ళీ రిపీట్ కాకుండా మహేష్ టీమ్ చాల జాగ్రత్తతో ప్రవర్తించవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అన్న మాటలు ‘భరత్’ సెన్సార్ టాక్ తరువాత విపిస్తోంది. 
BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
సినిమా కంటెంట్ బాగుంటే ఎవరు ఏమీ చేయలేరు అన్న విషయం వాస్తవమే అయినా ‘భరత్ అనే నేను’ సెన్సార్ పూర్తి అయిన తరువాత వస్తున్న రకరకాల ప్రచారాలు ఈమూవీని అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లను కలవర పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో మహేష్ తన ‘భరత్’ మూవీ ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. ఈమూవీ ప్రమోషన్ కు సుమారు 3 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నా ఈ మూవీ పై జరగబోయే నెగిటివ్ ప్రచారాన్ని సరిగ్గా మహేష్ టీమ్ అడ్డుకట్ట వేయలేకపోతే మహేష్ తీవ్ర నష్టానికి గురి అయ్యే పరిస్థుతులు ఏర్పడతాయి అన్న ప్రచారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: