నటించినవి కేవలం రెండు సినిమాలే అయినా శ్రీ రెడ్డి తెలివిగా ఎంచుకున్న ఉద్యమంతో ఓవర్ నైట్ టాప్ సెలెబ్రెటీగా మారిపోయింది శ్రీ రెడ్డి. ప్రస్తుతం ఆమె పేరు తెలియని వారు మన ఇరు రాష్ట్రాలలోను ఎవరు లేరు అంటే అతిశయోక్తి కాదు. శ్రీ రెడ్డి వేసిన చిన్న తప్పటడుగు ఆమెను ఇప్పుడు అగాధంలోకి తోసివేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
SRIREDDY LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
పవన్ పై ఆమె చేసిన కామెంట్స్ కు పవన్ అభిమానుల నుంచి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ప్రస్తుతం ఆమె ఏకాకి అయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు శ్రీ రెడ్డిని ఇప్పటి వరకు ప్రోత్సహించి దన్నుగా నిలిచిన ఒక ప్రముఖ ఛానల్ కూడ యూటర్న్ తీసుకోవడంతో శ్రీ రెడ్డి పరిస్థితి అయోమయంలోకి వెళ్లి పోయింది. 
SRIREDDY LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా శ్రీ రెడ్డి పవన్ పై చేసిన కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లోని పవన్ అభిమానులు హైదరాబాద్ లోనే కాకుండా తూర్పు గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాలలో ప్రవేట్ కేసులు పెడుతున్నారు. ఇది చాలదు అన్నట్లుగా హీరోయిన్ మాధవీ లత శ్రీ రెడ్డి పవన్ పై చేసిన కామెంట్స్ ను నిరసిస్తూ ఆమెపేరు ప్రత్యక్షంగా చెప్పకుండా ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు ఫిలిం చాంబర్ ఎదురుగా మౌన దీక్ష చేయబోతోంది. 
SRIREDDY LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ఇప్పటి వరకు శ్రీ రెడ్డికి సపోర్ట్ ఇచ్చిన వారంతా చిన్నచిన్నగా ఆమె నుండి దూరం అయిపోతున్న పరిస్థుతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి మరింత బలం చేకూరుస్తూ జీవిత రాజశేఖర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి వ్యూహాత్మకంగా శ్రీ రెడ్డికి చెక్ పెడుతూ అదేవిధంగా ఆమెకు సపోర్ట్ ఇచ్చిన మహిళా సంఘ నాయకురాలు సంధ్య పై కేసులు వేసిన నేపధ్యంలో శ్రీ రెడ్డి ఉద్యమానికి అదేవిధంగా ఆమె కామెంట్స్ కు ప్రాముఖ్యత తగ్గి కాలగార్బంలో కలిసిపోయే మరో ఉద్యమం లా శ్రీ రెడ్డి ఎంచుకున్న ఉద్యమం మారే అవకాశముంది అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: