తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారారు.  మొదట్లో పెద్దగా హిట్స్ రాకపోయినా..పోకిరి చిత్రం తర్వాత వరుసగా విజయాలు అందుకున్నారు.  ఇక పోకిరి చిత్రం అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. మాటల రచయిత కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు..తర్వాత వరుసగా అపజాయాలు మూటగట్టుకున్నాడు. దాంతో మరోసారి తనకు మంచి హిట్ ఇచ్చిన  కొరటాల శివతో మరో చిత్రాన్ని చేస్తున్నారు.
Image result for bharath ane nenu
కొత్తగా వచ్చే హీరోలు సైతం కమర్షియల్ సినిమాలను చేస్తుంటే.. సూపర్ స్టార్ అయ్యుండి కమర్షియల్ సినిమాల కంటే ప్రయోగాత్మక చిత్రాలే ఎక్కువగా చేశారు ప్రిన్స్ మహేశ్ బాబు. అలాంటి మ‌హేశ్ ఇక‌మీద‌ట‌ ప్రయోగాత్మ‌క సినిమాల జోలికి వెళ్ళ‌నని..పక్కా కమర్షియల్ సినిమాలనే చేస్తానని అంటున్నారు.   ఇక భరత్ అనే నేను చిత్రం పూర్తిగా పొలిటికల్ డ్రామా కదా..మరి మీరు పొలిటీషియన్ గా ఎలా ప్రిపేర్ అయ్యారు..ఎలా మెప్పించారు అన్న ప్రశ్నకు..మహేష్ సమాధానం ఇచ్చారు.
Image result for bharath ane nenu
‘దాదాపు సంవత్సరంన్నర క్రితం కొరటాల శివ ఈ కథ చెప్పినప్పుడు మొదట ఎగ్జైటింగ్‌గా అనిపించినప్పటికీ ఆ టైమ్‌లో భయం కూడా వేసింది. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నేను సంవత్సరంన్నర పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని చాలా విషయాలు నేర్చుకున్నా.. సినిమా చూసాక ప్రతీ నాయకుడు, ప్రతీ పొలిటికల్ పార్టీ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుందని భావిస్తున్నా’’ అని అన్నారు మహేష్.
Image result for bharath ane nenu
అంతే కాదు  “దీనిపై పెద్దగా హోం వర్క్ అయితే చేయలేదు. దర్శకుడు కొరటాల శివ ఎలా చేయమని చెప్తే అలా చేశా. కొన్ని సన్నివేశాలకైతే బావ జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడే విధానాన్ని ప‌రిశీలించి చేశాన‌”ని చెప్పుకొచ్చారు మహేశ్.


మరింత సమాచారం తెలుసుకోండి: