తెలుగు ఇండస్ట్రీలో ‘శ్రీమంతుడు’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంతో కమర్షియల్ హిట్ సాధించిన కొరటాల శివ, మహేష్ మరోసారి ‘భరత్ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  ఈ చిత్రంపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. సమజంలో జరగుతున్న అన్యాయాలపై ఓ యువకుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నాడు..సొసైటీని ఎలా మార్చగలిగాడు..దుష్ట శక్తులను ఎలా అంతం చేశాడన్న సారాంశమే ‘భరత్ అనే నేను’. 
Image result for bharath ane nenu
ఇప్పటి వరకు రొమాంటిక్, యాక్షన్ చిత్రాలు తీసిన మహేష్ బాబు పూర్తి స్థాయిలో ఓ పొలిటీషియన్ గా కనిపించబోతున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జోడీగా నటించిన ‘భరత్ అనే నేను’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ‘శ్రీమంతుడు’ సినిమాతో మహేష్ కెరియర్‌లోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి.. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ వేసవి కానుకగా ఏప్రిల్ 20 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Image result for bharath ane nenu
డి.వి.వి ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.  భారీ అంచనాలతో సుమారు 2000 థియేటర్స్‌లో భారీ విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ‘బ్లాక్ బస్టర్ హిట్.. మహేష్ బాబు యాక్షన్ అదిపోయింది’ అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సాంధూ.  గత కొంత కాలంగా యూఏఈ సెన్సార్ సభ్యుడిగా కొనసాగుతున్న ఉమర్ సింధూ పలు చిత్రాలకు రివ్యూలు ఇచ్చారు.  కొన్ని సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయినా..కొన్ని మాత్రం బాక్సాఫీస్ ముందు బోర్లా పడ్డాయి. రీసెంట్ గా సుకుమార్, రామ్ చరణ్, సమంత కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 
Image result for bharath ane nenu
రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రానికి ఈయన 3.5/5 రేటింగ్ ఇవ్వగా.. ‘భరత్ అనే నేను’ చిత్రానికి ఏకంగా 4/5 రేటింగ్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.   కాకపోతే ఆ మద్య ఉమేర్ సాంధూ  పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాలకు టాప్ రేటింగ్ ఇచ్చేసి ఆహా ఓహో అంటూ పొగిడేశాడు. దీనితో పాటు మహేష్ గత చిత్రం ‘స్పైడర్’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రివ్యూ ఇచ్చేశాడు. అయితే ఆ సినిమాల రిజల్ట్ మనకు తెలిసిందే.ఈసారి ఉమర్ సాంధూ ‘భరత్ అనే నేను’ చిత్రానికి ఇచ్చిన రివ్యూ ఎంత వరకూ కరెక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: