తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..నెల రోజుల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డికి...ఈ మద్య మహిళా సంఘాల మద్దతు లభించింది. దాంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఆమె పలువురు జూనియర్ ఆర్టిస్టులతో కొన్ని మీటింగ్స్ పెట్టింది. ఈ నేపథ్యంలో మొన్న పవన్ కళ్యాన్ ఆయన తల్లిపై అనకూడని పదాలతో తిట్టింది.  దాంతో ఒక్కసారే శ్రీరెడ్డి చేస్తున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మొత్తం మలుపు తిరిగింది. పవన్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
Image result for sri reddy protest
అంతే కాదు యూట్యూబ్ ఛానల్స్ లో తిట్లవర్షం కురిపిస్తున్నారు.  అయితే ఈ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని..దర్శకులు రాంగోపాల్ వర్మనే తనను పవన్ కళ్యాన్ ని తిట్టమని చెప్పారని ఆమె సన్నిహితురాలితో టెలిఫోన్ సంభాషన్ లీక్ కావడంతో ఈ ఎపిసోడ్ లో ఎన్నో ట్విస్టులు జరిగాయి.  కాగా, రాంగోపాల్ వర్మ తాను శ్రీరెడ్డిని పురమాయించిన విషయం నిజమే అని ఒప్పుకున్నారు.  దీంతో శ్రీరెడ్డి.. శ్రీశక్తి పేరుతో చేస్తున్న నిరసన రకరకాల మలుపులు తిరుగుతుంది.  పవన్ కళ్యాన్  దూషించిన మరుక్షణమే..ఆమె పై వ్యతిరేకత మొదలైంది. 

ఆ పోరాటానికి అర్థమే లేకుండా పోయింది. అప్పటి వరకు ఆమెను సపోర్ట్ చేసిన వారు కూడా వెనక్కితగ్గారు. అయితే ఎంతమంది వెనక్కి తగ్గినా.. ఆమెకు నేనున్నానంటూ ఆమెతో రామ్ గోపాల్ వర్మ చేయించిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో పెను సంచలనాలకు దారి తీసింది. ఇదిలా ఉంటే.. శ్రీరెడ్డిని ద్రౌపదిని చేస్తూ.. వర్మని శ్రీకృష్ణుని చేస్తూ ద్రౌపది వస్త్రాపహరణం ఫొటోని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Image result for pawan kalyan sri reddy
ఈ ఫొటోపై నెటిజన్లు.. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైరవుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. ‘‘నువ్వు దుశ్శాసనుడు లాగా చీరలు లాగే వాడివి కానీ.. శ్రీకృష్ణుడు లాగా చీరలు ఇచ్చేవాడివి కాదు’’ అంటూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. దీనికి వెంటనే వర్మ స్పందిస్తూ..‘‘మీడియాలో చూపించిన ద్రౌపది మరియు లార్డ్ శ్రీకృష్ణలను ప్రదర్శించే కార్టూన్ నాది కాదు.. అది యాదృచ్ఛికంగా వాట్సప్‌లో షేర్ అవుతుందంతే..’’ అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: