శ్రీ రెడ్డి వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతున్న నేపధ్యంలో ఆమె తదుపరి ఎత్తుగడలు ఎవరి ఊహలకు అందని విధంగా మారాయి. పవన్ పై కామెంట్స్ చేసిన తరువాత శ్రీ రెడ్డి గ్రాఫ్ రోజురోజుకు విపరీతంగా పడిపోతోంది. అయితే ఇలాంటి పరిస్థుతులలో కూడ శ్రీ రెడ్డి నాగార్జునకు సమస్యగా మారడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  
nagarjuna latest movie officer latest photos కోసం చిత్ర ఫలితం
శ్రీ రెడ్డికి మద్దతు పులుకుతూ రామ్ గోపాల్ వర్మ ట్విట్స్ పెడుతున్న దగ్గర నుంచి టాపిక్ వర్మ పై టర్న్ అవ్వడంతో వర్మ దర్శకత్వంలో వచ్చేనెల విడుదల కాబోతున్న నాగార్జున ‘ఆఫీసర్’ సినిమా పరిస్థితి ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈమధ్య కాలంలో నాగార్జున సినిమాలకు స్పందన కరువవుతున్న నేపధ్యంలో వర్మ ‘శివ’ లాంటి మ్యాజిక్ మళ్ళీ తనకు చేస్తాడు అన్న ఆశతో నాగ్ వర్మ బుట్టలో పడ్డాడు. 
nagarjuna latest movie officer latest photos కోసం చిత్ర ఫలితం
ఈసినిమా మొదలైన దగ్గర నుండి రకరకాల వివాదాలలో వర్మ కూరుకుపోతున్న నేపధ్యంలో వర్మ లేటెస్ట్ గా తీసిన ఆఫీసర్ తలాతోక లేకుండా తీసాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు వర్మను టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి అన్న ఒత్తిడి పెరిగిపోతున్న నేపధ్యంలో వర్మ ఎన్ని క్షమార్పణలు చెప్పినా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఈసారి వర్మను క్షమిస్తారా అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది. 
సంబంధిత చిత్రం
తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున లాంటి టాప్ హీరోతో సినిమాను చేస్తున్న జాగ్రత్తలను కూడ తీసుకోకుండా నాగ్ ఎన్ని సలహాలు ఇచ్చినా పట్టించుకోకుండా వర్మ ఈ ఆఫీసర్ ను తీసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాను వర్మ తన సొంత నిర్మాణ సంస్థ వర్మ కార్పోరేషన్ పై నిర్మించిన నేపధ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురు చేతిలో ఉన్న ధియేటర్లు వర్మ ‘ఆఫీసర్’ కు దొరకకపోతే వర్మ తన సినిమాను ఎలా విడుదల చేస్తాడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో వచ్చేనెల ఈమూవీ విడుదల డౌట్ అనే అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: