పవన్ కళ్యాణ్ తన తల్లిని దూషించే విధంగా కొందరు చేసిన కామెంట్స్ ను ప్రముఖంగా ప్రసారం చేస్తూ తన పై అదేవిధంగా తన కుటుంబం పై కొన్నిమీడియా సంస్థలు చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించండి అంటూ పట్టుపట్టి ఏర్పాటు చేయించిన టాలీవుడ్ 24 క్రాప్స్ సమావేశంలో పవన్ విషయాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం చర్చకు వచ్చింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
 పవన్ ఎలా బాధ్యుడు?
దీనికికారణం నిన్నసాయంత్రం విడుదలైన ఒక ప్రెస్ నోట్. అందులో టాలీవుడ్ ఇండస్ట్రీలోని అన్ని విభాగాలు అదేవిధంగా ‘మా’ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లుగా పేర్కొనడం అని అంటున్నారు. అయితే ఈసమావేశానికి వచ్చన అనేకమంది దర్శకులు నిర్మాతలు ఎవరు డైరెక్ట్ గా పవన్ పై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దాడిని డైరెక్ట్ గా ఖండించలేదు అన్నమాటలు వినిపిస్తున్నాయి.
 చిన్నపాటి కోపం రాదా?
చివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల పై 25 మందితో ఒకభారీ కమిటీ వేయడం ఆకమిటీ వివిధ చానెళ్లు, వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీ పై వ్రాస్తున్న వార్తలను పరిశీలించి ఒక నివేదిక ఇండస్ట్రీ పెద్దలకు సమర్పిస్తారని తెలుస్తోంది. అయితే ఈసమావేశంలో పాల్గొన్న అనేకమంది గతంలో కూడ అనేక ఛానళ్ళు ఇండస్ట్రీని ఇండస్ట్రీలోని వ్యక్తులను ముఖ్యంగా ఇండస్ట్రీలోని మహిళలను కించపరిచేలా చాలామంది మాట్లాడిన కామెంట్స్ ను ప్రసారం చేసినప్పుడు పట్టించుకోని ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు ఇంత హడావిడిగా ఎవరికోసం సమావేశం అయ్యాయి అంటూ పవన్ పేరు ప్రస్తావించకుండా కామెంట్స్ చేసినట్లు టాక్. 
ప్యాంట్లు తడిచిపోతాయ్..
ఇదేసందర్భంలో మరికొందరు మాట్లాడుతూ కొన్నిమీడియా సంస్థలను బహిష్కరించండి అంటూ ఇండస్ట్రీ పిలుపు ఇవ్వడం మంచిదికాదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనితో జరుగుతున్న పరిణామాలు అన్నీ పవన్ కు ఓపెన్ సపోర్ట్ గా రావడం లేదు అనిగ్రహించిన అల్లు అరవింద్ రంగంలోకి దిగి ఇండస్ట్రీ వర్గాలను ఆవేశంతో కొన్ని మీడియా ఛానల్స్ ను బహిష్కరించమని తాను కోరడం లేదనీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని అభిప్రాయ పడినట్లు టాక్. అయితే ఈసమావేసం ముగిసిన తరువాత పవన్ తన అభిమానులతో మాట్లాడిన సందర్భంలో ‘జనసేన’ ను దెబ్బ కొట్టాలని కొన్ని వర్గాలు చేస్తున్న నెగిటివ్ ప్రచారానికి ఆవేశ పడవద్దు అంటూ పిలుపు ఇవ్వడం ఈవిషయంలో పవన్ లేటెస్ట్ ట్విస్ట్..   


మరింత సమాచారం తెలుసుకోండి: