‘భరత్ అనే నేను’ విడుదలై మూడు రోజులు పూర్తి కాకుండానే 100 కోట్ల కలక్షన్స్ సినిమాగా మారిందని ఈసినిమా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈమూవీ రేంజ్ ఈరోజు ఈసినిమాకు వచ్చే కలక్షన్స్ ను బట్టి అంచనా వేయవచ్చని అంటున్నారు. 
KORATALA SIVA ALONG WITH MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీని తీసినందుకు కొరటాల శివకు నటించిన మహేష్ కు ప్రశంసలు లభిస్తూ ఉన్నా ఈమూవీని అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన నిర్మాత డివివి దానయ్యను ప్రశంసల విషయంలో కొన్ని మీడియా వర్గాలు మరిచిపోవడం చామందిని ఆశ్చర్య పరుస్తోంది. రెండున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు నిర్మాత డీవీవీ దానయ్య. 
అయితే ఆయనకు చాలామంది టాప్ నిర్మాతల స్థాయిలో గుర్తింపు లేదు అని కొందరు అంటారు. భారీ నిర్మాతలు అనగానే సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సురేశ్ బాబు అల్లు అరవింద్ దిల్ రాజ్ పేర్లు వినిపిస్తే ఈమధ్య కాలంలో చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ నిర్మాతలలో శోభు యార్లగడ్డకు కూడ మంచి గౌరవం ఉంది.
DVV DANAYYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇక టాప్ హీరోలతో సినిమాలు తీస్తున్న మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలకు హీరోలతో సమానంగా ఇమేజ్ ఏర్పడింది. అయితే వీరందరికీ భిన్నంగా భారీ సినిమాలు తీయడమే కాదు త్వరలో ప్రారంభం కాబోతున్న చరణ్ జూనియర్ ల రాజమౌళి మల్టీ స్టారర్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న దానయ్యకు ఎందుకు గుర్తింపు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  
DVV DANAYYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
గతంలో అనేకమంది నిర్మాతలతో భాగస్వామిగా సినిమాలు తీసిన దానయ్య ఒక నిర్మాణ సంస్థను ఏర్పరుచుకుని ఎన్నో భారీ సినిమాలను ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలతో చేస్తున్న విషయం తెలిసిందే. దానయ్య డబ్బులు పెడతారు ఏం కావాలంటే అది సమకూరుస్తారు అనే మాటలు ఉన్నాయి. అంతేకాదు తన సినిమాల ప్రొడక్షన్లో పెద్దగా జోక్యం చేసుకోడు అనే వార్తలు కూడ ఉన్నాయి. ఇలాంటి దానయ్యకు ఇప్పటికీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల లిస్టులో ఆయన పేరు ఎందుకు చివరి వరసలో ఉంటోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలోని దానయ్య సన్నిహితులు కామెంట్స్ చేస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: