మహేష్ ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకు పోతున్న నేపధ్యంలో ఈమూవీ సక్సస్ మీట్ ను మీడియా ప్రతినిధులతో నిర్వహించారు. ఈ సక్సస్ మీట్ లో ఆనందంతో పొంగిపోతున్న మహేష్ ఈసినిమా సక్సస్ గురించి తాను పడ్డ టెన్షన్ ను వివరిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. 
సక్సెస్‌తో రిలీఫ్‌తో ఉన్నాను
‘భరత్’ సినిమా రిలీజ్‌ కు ముందు టెన్షన్‌తో తనకు వణుకు వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ గ్లాస్ పట్టుకొంటే చేతులు వణికాయని చెపుతూ ఇక లాభం లేదనుకుని ఈసినిమా విడుదలకు ముందు 19వ తేదీన చెన్నై వెళ్ళి తన అమ్మ ఇందిరను కలిసి ఆమె ఇచ్చిన కాఫీ తాగిన తరువాత తన టెన్షన్ తగ్గిన విషయాన్ని బయటపెట్టాడు. తన తల్లి చేసిఇచ్చే కాఫీ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెపుతూ తన టెన్షన్స్ అన్నీ తీర్చగల శక్తి తన తల్లి చేసి ఇచ్చే కాఫీలో ఉంది అంటూ తన తల్లిని తలుచుకుని ఉద్వేగంలోకి వెళ్ళిపోయాడు మహేష్. 
రిలీజ్‌కు వణికిపోయాను
దర్శకుడు కొరటాల శివ గురించి మాట్లాడుతూ తాను తన డైరెక్టర్ల సినిమాలలో  రెండోసారి నటించినప్పుడు ఆ మూవీ ప్రాజెక్టులు అన్నీ ఫెయిల్ అయిన సెంటిమెంట్ ను బయట పెడుతూ ఆ సెంటిమెంట్ ను కూడ ఎదిరించి తనకు భారీ హిట్ ను అందించిన కొరటాల ఋణం తాను తీర్చుకోలేను అంటూ ఆవేశంగా కొరటాలను కౌగలించుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇదే సందర్భంలో నటుడు బ్రహ్మాజీ గురించి మాట్లాడుతూ బ్రహ్మాజీ తనతో నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్న నేపధ్యంలో భవిష్యత్ లో తాను నటించే ప్రతి సినిమాలోను బ్రహ్మాజీ ఉండేలా చూసుకుంటాను అంటూ జోక్ చేసాడు మహేష్. 
పూరీ జగన్నాథ్ తర్వాత కొరటాలకే..
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ తన సినిమా సూపర్ సక్సెస్ అయినప్పుడు తన తండ్రి కళ్ళల్లో కనిపించే ఆనందం తనకు ఎంతో శక్తిని ఇస్తుంది అని చెపుతూ తాను ఎన్ని విజయాలు సాధించినా సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగానే పిలిపించుకోవడం తనకు ఇష్టం అని చెపుతూ తన తండ్రి పై మరొకసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన పిల్లల పిల్లలకు చూపించే విధంగా లైబ్రరీలో పెట్టుకొనే సినిమా తన ‘భరత్’ అని చెపుతూ పొంగిపోయాడు మహేష్. సామాన్యంగా మీడియా సమావేశాలలో అతి తక్కువగా మాట్లాడే మహేష్ తన అలవాటుకు భిన్నంగా అనేక జోక్స్ వేస్తూ అందర్నీ నవ్విస్తూ కనిపించిన మహేష్ తీరును చూసిన మీడియా వర్గాలు కూడ మహేష్ ఆనందానికి షాక్ అయ్యాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: