భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని అభిమానులకు సానియానే తెలియజేశారు. త్వరలోనే తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతుందని సానియా మిర్జా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టుకు తోడుగా ఒక ఆసక్తికరమైన ఫొటోను జత చేసింది. ఇటు సానియా, అటు షోయబ్ మాలిక్ ల దుస్తులు ఉండగా... మధ్యలో మీర్జా-మాలిక్ పేరుతో చిన్న డ్రెస్ ఉంది.
Image result for సానియా మిర్జా
మరోవైపు 'బేబేమీర్జామాలిక్' పేరుతో హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది.సానియా పోస్టుకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి తెగ లైక్స్‌, కామెంట్స్‌ వచ్చాయి.  ఆమె దీనిని అభిమానులతో పంచుకున్న గంటలోపే 54 వేల మంది లైక్‌ చేశారు. 1,502 మంది కామెంట్స్‌ చేశారు. ఇది నిజంగా శుభవార్తని ఆనందం వ్యక్తం చేశారు.
Image result for సానియా మిర్జా
తాను గర్భం దాల్చిన విషయాన్ని సానియా ప్రకటించిన వెంటనే... పట్టరాని ఆనందంల తమ మనసుకు కలిగిందని చెప్పారు సానియా మిర్జా. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పాకిస్తాన్‌‌కు చెందిన క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: