తెలుగు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రాలు చాలా తక్కువే అయినా హిట్స్ విషయంలో నెంబర్ వన్ పోజీషన్లో ఉన్నారు.  చిరుత చిత్రం తర్వాత రిలీజ్ అయిన ‘మగధీర’రికార్డుల మోత మోగించింది.  ఆ తర్వాత రచ్చ, నాయక్ ఇలా మనోడి ఖాతాలో ఎన్నో హిట్స్ పడ్డాయి.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ధృవ’ ఘనవిజయం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన  'రంగస్థలం'  బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్ల గ్రాస్ సాధించినట్టు ‘రంగస్థలం’ చిత్ర యూనిట్ పేర్కొంది.

త్వరలోనే ఇది రూ.200 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టనుందని సినీ ట్రేడ్ వర్గాల అంచానా వేశారు..వారి అంచనలాలు అందుకుంది ఈ చిత్రం.  1980ల నాటి గ్రామీణ వాతావరణంలో ఎమోషనల్‌ డ్రామాగా రామ్‌ చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'రంగస్థలం'. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్ చెరుకూరి కలసి నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది.
Image result for రూ.200 కోట్ల క్లబ్‌లో 'రంగస్థలం'
గత నెల 30న విడుదలైన ఈ సినిమా మ‌రో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తాజాగా 200 కోట్ల క్లబ్‌లో చేరింది. 'బాహుబలి' మూవీ తర్వాతి స్థానంలో  ఇప్పుడు సుకుమార్ సినిమానే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ నిల‌క‌డ‌గా ఉండడంతో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరుతుంద‌ని అంటున్నారు సినీ విశ్లేషకులు.
Related image
ఇక ఓవర్సీస్‌లో రంగస్థలం మూవీ నాలుగు మిలియ‌న్ డాల‌ర్ల క్లబ్‌లో చేరేందుకు సన్నద్ధమవుతోంది. మగధీర తరువాత 'రంగస్థలం' అంతటి స్థాయిలో చరణ్‌కి హిట్‌ తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ సినిమాలన్నింటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: