టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రతీ సినిమాకు కలెక్షన్లపరంగానే కాకుండా నటనపరంగా పైచేయి సాధిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ నుంచి సాగుతున్న విజయ పరంపర.. మజ్ను, నిన్నుకోరి, ఎంసీఏ చిత్రాలు నాని ప్రతిభకు, స్టామినాకు అద్దం పట్టాయి. విభిన్నమైన చిత్రాల ఎంపికతో తన మార్కును సొంతం చేసుకొంటున్నారు. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని ద్విపాత్రాభిన‌యంలో మేర్ల‌పాక గాంధీ రూపొందించిన చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'.
Image result for నానీ 'కృష్ణార్జున యుద్ధం
అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాకి హిప్ హాప్ త‌మిళ సంగీత‌మందించారు.  ఎంసీఏ సినిమా తర్వాత నానికి కాస్త ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పొచ్చు.  నిర్మాతగా మారి ‘అ!’ సినిమా నిర్మించాడు..కానీ ఆ సినిమా యావరేజ్ టాక్ వచ్చింది.  నేచుర‌ల్ స్టార్ నాని ద్విపాత్రాభిన‌యంలో మేర్ల‌పాక గాంధీ రూపొందించిన చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'.
Image result for నానీ 'కృష్ణార్జున యుద్ధం
అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాకి హిప్ హాప్ త‌మిళ సంగీత‌మందించారు.   ఏప్రిల్ 12న విడుద‌లైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చింది..అంతే కాదు కలెక్షన్ల పరంగా కూడా గత సినిమాలతో పోలిస్తే..చాలా దారుణంగా వచ్చింది.  ఫుల్ ర‌న్‌లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.12.14 కోట్ల ఫైన‌ల్ షేర్ రాబ‌ట్టుకోగా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.14.79 కోట్ల ఫైన‌ల్ షేర్‌ను రాబ‌ట్టుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.
Image result for నానీ 'కృష్ణార్జున యుద్ధం
థియేట్రిక‌ల్ రైట్స్ రూ.30 కోట్లు ఉన్న ఈ సినిమా 50 % కూడా రిక‌వ‌రీ కాలేద‌ని.. 8 వ‌రుస విజ‌యాల త‌రువాత నాని నుంచి వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌నే కాకుండా ట్రేడ్ వ‌ర్గాల‌ను నిరాశ‌ప‌రిచింద‌ని ట్రెడ్ వర్గాలు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: