భారీఅంచనాల మధ్య విడుదలైన ‘భరత్ అనే నేను’ విడుదలైన దగ్గర నుంచి ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రచారంజరుగుతోంది. కానీ అసలు వాస్తవాలు వేరుఅంటూ ఇండస్ట్రీ వర్గాలలో కొన్నివార్తలు హడావిడి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీస్థాయిలో విడుదలైన ఈమూవీ తొలి వారంతంలో క్రియేట్ చేసిన కలక్షన్స్ రికార్డులను చూసి ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. 
MAHESH IN BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఆతర్వాత ఈమూవీ కలక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈమూవీని నిలబెట్టడానికి మహేష్ కొరటాలలు రంగంలోకి దిగి జనంమధ్యకు వెళ్లి ఈమూవీ కలక్షన్స్ ను పెంచడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్నిప్రయత్నాలు చేసారు. కానీ ఈమూవీ మొదటి పదిరోజులకు వరల్డ్ వైడ్ షేర్ గా 80 కోట్లు తెచ్చుకుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈమూవీ బయ్యర్లు నష్టాలు లేకుండా బ్రేక్ ఈవెన్ కు రావాలంటే 100 కోట్ల షేర్ సాధించాల్సిన పరిస్థితి ఉంది. 
MAHESH IN BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు గతరెండు రోజులుగా మన తెలుగురాష్ట్రాలలో మండిపోతున్న ఎండలు కారణంగా ‘భరత్’ కలక్షన్స్ మరింతపడిపోయాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ‘రంగస్థలం’ కలక్షన్స్ ను బ్రేక్ చేయడం అటుంచి ‘ఖైదీ నంబర్ 150’ వసూళ్లను దాటగలిగితే అదృష్టమే అంటున్నారు. ఇక ఓవర్సీస్ లో మహేష్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈసినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో మొదటి వీకెండ్లోనే 2.5 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు రావడంతో ఈమూవీ చాల సులువుగా 4 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిపోతుంది అని అంచనాలు వేసారు. 
MAHESH IN BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈమూవీ 3.5 మిలియన్ మార్కును అందుకోవడం సందేహం అంటున్నారు. దీనికికారణం ఈసినిమాకు ఓవర్సీస్ లో కూడ రిపీట్ ఆడియన్స్ రావడంలేదు అన్నవార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఓవర్సీస్ లో ఈసినిమాకు రోజుకు కొన్నివేల డాలర్లు మాత్రమే వస్తున్నాయి. మరో రెండురోజులలో విడుదల కాబోతున్న అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ మూవీ ఎఫెక్ట్ ‘భరత్’ కలక్షన్స్ పై విపరీతంగా ఉంటుంది అని అంటున్నారు. ఈమూవీకి హిట్ టాక్ రానప్పుడు మాత్రమే ‘భరత్’ బయ్యర్లు లాభాల బాట పడతారని లేకుంటే మన ఇరు రాష్ట్రాలలోని ‘భరత్’ బయ్యర్లకు ఎంతోకొంత నష్టం తప్పదని టాలీవుడ్ విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. ఈనేపధ్యంలో వ్యూహాత్మకంగా ‘భరత్’ మూవీకి కొన్ని సీన్స్ యాడ్ చేసినా ఎంత వరకు ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నవిషయమై ఈమూవీ బయ్యర్లకే సందేహాలు ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: