తెలుగు చలన చిత్ర సీమలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు కళామతల్లికి రెండు కళ్లుగా చెప్పుకుంటారు.  ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..తెలుగు బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆయన ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా చిరస్థాయిగా గుర్తుండి పోతారు.  సీనీ రంగంలో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఏ పాత్ర అయినా సరే అవలీలగా పోషించా ఆయా పాత్రలకు వన్నె తెచ్చేన ఘన ఎన్టీఆర్ కి దక్కుతుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దుర్యోదనుడు, రావణబ్రహ్మ గా మెప్పించిన ఆయన ఎన్నో సాంఘిక చిత్రాల్లో ప్రియుడిగా, అన్నగా, తండ్రిగా అద్బుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 
Image result for mahanati audio release
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రం తెరకెక్కబోతుంది.  ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకలు నిన్న జరిగాయి..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడారు.  అయితే ‘మహానటి’ లో ఎన్టీఆర్ పాత్ర పోషించే చాన్స్ మీకు వచ్చినా..ఆ పాత్ర చేయలేదని ప్రశ్నలు రాగా..తాతగారి పాత్రను చేయడం ఈ జన్మలో జరగని పని అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తేల్చి చెప్పాడు.

అది నటిస్తే జరగదని, జీవిస్తేనే ఆ పాత్రకు న్యాయం చేయగలమని పేర్కొన్నాడు. ఒక వ్యక్తిగా నటించడం చాలా కష్టమైన పని అని, అది తన వల్ల కాదని అన్నారు. నిర్మాత స్వప్న ఓ రోజు తన వద్దకు వచ్చి మహానటి సినిమాలో గెస్ట్ రోల్‌గా తాతగారి వేషాన్ని వేయాలని కోరిందని తెలిపాడు. అయితే, తాను వేయలేనని చెప్పేశానన్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, ఆయన వేషం వేసే అర్హత తనకు లేదని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

ఆయన పాత్ర పోషించడం ఈ జన్మలో జరిగే పనికాదన్నాడు. తాతగారి పాత్రను పోషించే దమ్ము తనకు లేదన్నాడు. ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించిన దుల్కర్, కీర్తి, సమంత, విజయ్‌లకు హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నాడు. ఇక సీతారామశాస్త్రి గురించి మాట్లాడే అర్హత, అనుభవం తనకు లేవని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: