తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య బయోపిక్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇప్పటికే అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిన్న ఆడియో వేడుక కూడా సక్సెస్ ఫుల్ గా సాగింది.  ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్".  ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.  

Image result for ntr biopic

గత నెల 29 నుంచి షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా..అనుకోకుండా ఈ చిత్ర దర్శకులు తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫిషియల్ గా ప్రకటించారు.   దాంతో ఎన్టీఆర్ బయోపిక్ పై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ చిత్రం దర్శకత్వం బాధ్యతలను   హీరో నందమూరి బాలకృష్ణే చేపట్టనున్నారని వార్తలు కూడా వచ్చాయి.  కాకపోతే ఇప్పటి వరకు  ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే అంశం గురించి స్పష్టత లేదు. అయితే దర్శకత్వ పర్యవేక్షణ చేసి పెట్టమని ఆయన కె.రాఘవేంద్రరావు.. క్రిష్.. కృష్ణవంశీలను సంప్రదించారట.

కాకపోతే ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వలన కుదరదని చెప్పారట. ఈ నేపథ్యంలో తెరపైకి 'చంద్ర సిద్ధార్థ' పేరు వచ్చింది. గతంలో ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా, ఏమో గుర్రం ఎగరావచ్చు లాంటి అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వంలో వహించిన  చంద్ర సిద్ధార్థ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయం అధికారికంగా వెలువడవలసి వుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: