భారత దేశంలో  ప్రతి రోజూ మహిళలపై, అభం శుభం తెలియని పసిపాపలపై ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి.  ఇక తెలుగు ఇండస్ట్రీలో పై ఈ మద్య నటి శ్రీరెడ్డి ఆరోపించినట్లు కాస్టింగ్ కౌచ్ ఎంతగానో ఉందని..ఎంతో మంది అమ్మాయిలు బలిఅవుతున్నారని..ఇక్కడ అసలు మహిళలకు ఏమాత్రం గౌరవం లేదంటూ రచ్చ రచ్చ చేసింది.
Image result for sri reddy
శ్రీరెడ్డి వ్యవహారంలో మీడియా వ్యవహరించిన తీరు వల్ల తెలుగు సినిమా పరిశ్రమ పరువుకు కాస్త భంగం వాటిల్లిందనేది మాత్రం అక్షర సత్యం. ఈ పరిణామాల పట్ల హీరోలు, తెలుగు సినిమా పెద్దలూ సమావేశం అయ్యారు. అందులో వారి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో తెలియదు. కాని ఇండస్ట్రీలో మహిళలకు ఎంత గౌరవం ఇస్తారనేది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నట్టున్నారు.  ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ‘మహానటి’ ఆడియో వేడుకలో..కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మహిళల గురించి ఎంతో గొప్పగా పొగిడారు. 

Image result for mahanati audio function

నాగార్జున మాటల్లో..తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల లైఫ్ ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్స్‌లో ‘మహానటి’ ఒకటి. అదీ ఓ తెలుగు సూపర్‌స్టార్‌..ఓ మహానటిపై బయోపిక్ తీయడం ఇదే మొదటి సారి..ఇక ఈ  చిత్రాన్ని నిర్మించిన స్వప్నదత్, ప్రియాంక దత్… ఇద్దరూ మహిళలే. అలాగే, ఈ చిత్రానికి ఇరవైమంది ఫిమేల్ టెక్నీషియన్స్ వర్క్ చేశారట. ఆడియోకి ఇంత అద్భుతమైన స్టేజ్‌ క్రియేట్‌ చేసింది మహిళలే. మహానటి ఆడియో వేడుక సెట్, డెకరేషన్ ఏర్పాటు చేసింది కూడా అమ్మాయిలే కావడం విశేషం.  తెలుగు  ఇండస్ట్రీ మహిళలకు ఇచ్చిన గౌరవం అది. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నా అన్నారు. 

Image result for mahanati audio function

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..ఈ మధ్య మహిళలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయనే వార్తలను మనం చూస్తున్నాం. ఒక్కసారి ‘మహానటి’ చూశాక, (అకృత్యాలకు పాల్పడేవారు) ‘మనం ఎందుకు మగాళ్లగా పుట్టాం?’ అని తప్పకుండా అనుకుంటారు. సావిత్రిగారు ట్రూ లేడీ సూపర్‌స్టార్‌. మహిళ బలం ఏంటో? మహిళలు తలచుకుంటే ఏం చేయగలుగుతారు? అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా చూసి మహిళలను గౌరవిస్తారని ఆశిస్తున్నా ఆశిస్తున్నానని అన్నారు.  ఇలా ఓ వైపు మహానటి సావిత్రిని పొగుడుతూనే నేటి సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయలపై విమర్శలు గుప్పిస్తూనే..తెలుగు ఇండస్ట్రీ మహిళలకు ఎంతో గౌరవం ఇస్తుందని ప్రశంసలు గుప్పించారు. 

https://www.youtube.com/watch?v=2LNz5rUpS0s


మరింత సమాచారం తెలుసుకోండి: