ప్రిన్స్ మహేష్ బాబుకు మెగా ఫ్యామిలీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందట. ఈవిషయాన్ని స్వయంగా చిరంజీవి ఈమధ్య తాను జరిపిన అమెరికా పర్యటనలో అక్కడ తనను కలిసిన ఎన్ఆర్ఐ లతో మాట్లాడుతూ ఈషాకింగ్ న్యూస్ బయటపెట్టినట్లు తెలుస్తోంది. 
CHIRANGEEVI AT DALLAS AMERICA MEETING PHOTOS కోసం చిత్ర ఫలితం
అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో అక్కడ తెలుగువారితో జరిగిన సమావేశంలో చిరంజీవి వారడిగిన అనేక ఆసక్తికర విషయాల పై సమాధానం ఇచ్చాడు. ఇదే సందర్భంలో ఆ ఎన్ఆర్ఐ ల సమావేశానికి వచ్చిన ఒక వ్యక్తి చిరంజీవిని ఉద్దేసించి ‘భరత్ అనే నేను’ చూసారా అని అడిగినప్పుడు చిరంజీవి ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 
CHIRANGEEVI AT DALLAS AMERICA MEETING PHOTOS కోసం చిత్ర ఫలితం
‘భరత్’ సినిమాను తాను మొదటిరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటిలో చూసాను అని చెపుతూ తను మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు అంతా మహేష్ వీరాభిమానులం అన్న విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు చిరంజీవి. ఇదే సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ సినిమాలలోనే కాకుండా బయట కూడ చాల హూందాగా మాట్లాడే మహేష్ అంటే తనకు చాల ఇష్టం అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు మెగా స్టార్. 
సంబంధిత చిత్రం
‘భరత్’ మూవీలో మహేష్ మీడియా వారితో మాట్లాడే సందర్భంలో మీడియాకు ఎదురు ప్రశ్నలు వేసిన సీన్ తనకు నచ్చింది అని చెపుతూ మంచి సందేశం ఉన్న కథను కమర్షియల్ అంశాల గురించి ఆలోచించకుండా ధైర్యంగా తీసిన కొరటాల నటించిన మహేష్ లను ఎంత అభినందించినా సరిపోదు అంటూ చిరంజీవి కామెంట్ చేసాడు. చిరంజీవి నోటి వెంట ఈ ప్రశంసలు విన్న ఎన్ఆర్ఐ వర్గాలలోని కొందరు మాత్రం ఈమధ్య కొన్ని మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసినప్పుడు ఆకథనాల పై ఓపెన్ గా బయటకు వచ్చి మీడియా సంస్థలను ఏమీ అనలేక మౌనం వహించిన చిరంజీవి ‘భరత్’ పాత్రలో మహేష్ మీడియాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసాడు కాబట్టి తాను అనలేని మాటలను మహేష్ అన్నందుకు మహేష్ ను ఇంతగా చిరంజీవి అభిమానిస్తున్నాడు కాబోలు అంటూ జోక్ చేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: