స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా నా పేరు సూర్య‌. ఉప శీర్షిక నా ఇళ్లు ఇండియా. టాలీవుడ్‌లో కిక్‌, కిక్ 2, టెంప‌ర్ లాంటి వైవిధ్య‌మైన సినిమాల‌కు స్టోరీ ఇచ్చిన స్టార్ స్టోరీ రైట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాతో మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. బ‌న్నీ కెరీర్‌లోనే ఓ ఆర్మీ అధికారిగా చాలా సీరియ‌స్‌గా క‌నిపించే ఆర్మీ అధికారిగా ఈ సినిమాలో న‌టించాడు. కోపాన్ని ఏ మాత్రం అణుచుకోలేని అధికారిగా బ‌న్నీ న‌టించిన ఈ సినిమాను ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీథ‌ర్‌, బ‌న్నీ వాస్ సంయుక్తంగా నిర్మించారు.

Image result for naa peru surya

బ‌న్నీ స‌ర‌స‌న అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. శుక్ర‌వారం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సూర్య‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.111 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ విష‌యానికి వ‌స్తే రూ.80 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. అంటే రూ.80 కోట్ల షేర్ వ‌స్తేనే డిస్ట్రిబ్యూట‌ర్లు బ్రేక్ ఈవెన్‌కు వ‌స్తారు. ఏరియా వైజ్‌గా సూర్య ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.

Image result for naa peru surya

' నా పేరు సూర్య '  ఏరియా వైజ్ రైట్స్ ( రూ.కోట్ల‌లో)


నైజాం - 21.0
సీడెడ్ - 12.0
ఉత్తరాంధ్ర - 8.0
ఈస్ట్ - 5.4
వెస్ట్ - 4.2
కృష్ణా - 5
గుంటూరు - 5.5
నెల్లూరు - 2.52
క‌ర్ణాట‌క - 7.0
కేర‌ళ - 1.5
రెస్టాఫ్ ఇండియా - 2.0
ఓవ‌ర్సీస్ - 6.0
------------------------------------------------
వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ = 80.12
-------------------------------------------------
శాటిలైట్ - (హిందీ+తెలుగు) = 24.5
మ్యూజిక్ - 3.5
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ = రూ.110 కోట్లుగా నిర్మాత‌లు ప్ర‌క‌టించారు



మరింత సమాచారం తెలుసుకోండి: