rangammatta & sridevi కోసం చిత్ర ఫలితం
యాంకర్ అనసూయ ఎలా రెచ్చిపోద్దో అందరికీ తెలుసు. ఏదో ఒక సినిమాలో నటించినంత మాత్రాన ఆమె తనను శ్రీదేవితో పోల్చునే స్థాయికి అహంకారం పెరిగిందని నెటిజెన్లు అంటున్నారు. కనీసం పోల్చుకోడానికైనా కాస్త ఆలోచించాలి, కొన్ని హద్దులు ఉండాలి.  శ్రీదేవి అందం అంటే దివిజ గంగ సౌంధర్యం. ఇక ఈ యాంకరమ్మ అనసూయ అందం ...మనకెందుకులే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా! చెప్పటం.  ఈ మాత్రం తింగిరి సౌందర్యానికే మిడిసి పాటెందుకని అంటున్నారు శ్రీదేవి అభిమానులు.

తను కట్టుకున్న చిలపచ్చ చీరె తో ప్రక్కన అదే రంగు చీరలో తళుక్కుమన్న శ్రీదేవి ఒకే ఫ్రేం లో శ్రీదేవి అభిమానులకు సుర్రున కాలే ఫోటో ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది యాంకర్ అనసూయ. ఈ మధ్య "రంగస్థలం" సినిమాలో "రంగమ్మత్త" గా ప్రేక్షకుల్ని తన ఓవర్ డోస్ నటన లో అలరించిన ఈ జబర్దస్త్ యాంకరమ్మ,  చిలపపచ్చ రంగు చీరకట్టుకుని శ్రీదేవి లా ఫీల్ అవుతూ ఒక ఫ్రేమ్‌లో శ్రీదేవిని, మరో ఫ్రేమ్‌లో తనను ఊహించుకుంటూ ముచ్చట పడిపోతూ  "ఈరోజు తన జబర్దస్త్ షో లో తన ఇంట్రో సాంగ్‌ ని అందాల నటి శ్రీదేవికి డెడికేట్ చేస్తున్నట్టు"  కామెంట్ చేసింది. సాంగ్ డెడికేట్ వరకూ ఒకే, కాని ఇప్పుడే ఒక ఫ్రేమ్‌లో శ్రీదేవి, మరో ఫ్రేమ్‌లో అనసూయ అంటే, ప్రపంచ వ్యాప్త శ్రీదేవి అభిమానులు వీక్షించడం, వీక్షించి ఆపై భరించటం ఒక ఇబ్బందికర అనుభవమే. తలిస్తేనే ఇబ్బందికర దృశ్యం కూడా. ఈమెకంత సీన్ లేదులే అంటు న్నారు ఈ మేళం చూసినోళ్ళు.  

సంబంధిత చిత్రం

శ్రీదేవి అందానికి నిలువెత్తు ఋజువైన గీతాల్లో మనకు గుర్తొచేది "గోవిందా...గోవిందా...సినిమాలో "అందమా.. అందుమా.. అంద నంటే అందమా.. ప్రాణమున్న పైడిబొమ్మ.. పారిజాత పూలకొమ్మ.. పరవశాలు పంచవమ్మ.. పాల సంద్రమా" అంటూ ఆమె అందాన్ని పొగుడుతూ నాగ్ పాడిన పాటే గుర్తుకు వస్తుంది. ఈ సాంగ్‌లో ప్లైయిన్ శారీస్‌ లో శ్రీదేవి అంద చందాలను వర్ణించాలంటే కవులకు పెద్ద పరీక్షే. ముఖ్యంగా 'చిలకపచ్చ రంగు చీర' లో ఆమె అందం, చిలకపచ్చ మరతక వర్ణ శిల్పమా! అన్నట్టుగా ఒక దివ్యాంగన హొయలు, సోయగాలతో కదలాడే కావ్యకన్య గుర్తుకు వస్తూ ఉంటుంది. 

sreedevi in andama anduma song కోసం చిత్ర ఫలితం

తెల్లాతెల్లని చీరలోన చందమామ! పట్టాపగలే వచ్చినావు చందమామ! ....... ఆ చందమామకు ఈ తింగిరి భామకు పోలికా! 

sreedevi in andama anduma song కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు అదే చీరను ఈ యాంకరమ్మ కట్టుకుని శ్రీదేవి మాదిరి స్టెప్పుల్ని అనుసరిస్తూ చిందులేస్తే చూసి ఎంజాయ్ చేయండంటూ "ఒక రికార్డింగ్ డాన్స్" తలపించేలా తన జబర్దస్త్‌ షో కు ప్రమోషన్స్ నిర్వహించేసింది. రికార్డింగ్ దాన్స్ చేస్తే, చేశావ్! కాని "రంగమ్మత్తా"! కాస్త పోలికలు పోల్చుకునే ముందు ఆమెకు ఆత్మీయ అభిమానులు కోట్లలో  ఉంటారు వాళ్లు హర్ట్ అవుతారని ఆలోచించక పోతే ఏలా తల్లీ! హనుమాన్ లాగా మూతి ఉందని ఒక కోతి కుప్పి గంతులేసిన చందంలా ఉంది నీ అందం శ్రీదేవితో పోల్చు కుంటే రంగమ్మట్టా! 

sreedevi in andama anduma song కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: