స్వీటీ అనుష్క ఈరోజు ఒకప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన డ్రీమ్ సీక్రెట్స్ ను బయటపెట్టింది. తాను సినిమాలలోకి వచ్చిన తరువాత తన ఆలోచనలు అన్నీ సినిమాల చుట్టే తిరుగుతున్నాయని సినిమాలు తప్ప మరొకప్రపంచం ఉంటుంది అన్న విషయం తాను పూర్తిగా మర్చిపోయాను అని అంటోంది ఈయోగా బ్యూటీ. 
ANUSHKA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తాను విదేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒకమంచి దృశ్యం చూస్తే దానిని తాను నటించే సినిమాలలో చూపెడితే బాగుంటుంది అన్న అభిప్రాయం కలుగుతుంది అని అంటూ ఎక్కడైనా ఒక గొప్ప మాట చదివితే ఇలాంటి మాటలు సినిమాలలో చెపితే జనానికి బాగా చేరువ అవుతుంది కదా అన్న అభిప్రాయం తనకు కలుగుతుంది అని అంటూ తన ఆలోచనలను షేర్ చేసింది అనుష్క. ఇలా తాను నటి అయ్యాక వస్తువులనీ మనుషులను చూసే కోణం అంతా మారిపోయి సినిమాల చుట్టూ తిరుగుతోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అనుష్క. 
ANUSHKA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు తాను నటించిన సినిమా విడుదల ముందురోజు తనకు నిద్రలో వచ్చే కలలు అన్నీ సినిమాల చుట్టూనే తిరుగుతాయని దీనితో ఇలాంటి కలలు తనకు రావడం తనకు సినిమాల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం అని అనిపిస్తోంది అంటూ అనుష్క తన కలల సీక్రెట్ ను బయట పెట్టింది. ఇది ఇలాఉండగా అనుష్క లేటెస్ట్ గా కేదార్ నాథ్ టెంపుల్ లో సందడి చేసిన విషయం హాట్ టాపిక్ గా మారింది. తన రొటీన్ గెటప్ కు భిన్నంగా పెద్ద బొట్టు పెట్టుకుని శివుడు ఆలయం చుట్టూ ప్రదక్షణాలు చేయడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. అంతేకాదు కొంతమంది వేద పండితులతో అనుష్క ఈ ఆలయంలో పూజలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 
ANUSHKA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఈపూజలు పూర్తి చేయాలని అనుష్క ప్రయత్నించినా ‘బాహుబలి’ మూవీ వల్ల ఆమెకు వచ్చిన నేషనల్ ఇమేజ్ తో కేదార్ నాథ్ ఆలయంలో ఆమెను చాలామంది గుర్తు పట్టడంతో ఆమె వారందరితో ఫోటోలు తీయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడ ఈ పూజలలో పాల్గొన్నారు. గత కొంత కాలంగా అనుష్క పెళ్ళికి సంబంధించిన గాసిప్పులు వస్తున్న నేపధ్యంలో ఈ పూజలకు అనుష్క పెళ్ళికీ ఏమైనా లింక్ ఉందా అంటూ కేదార్ నాథ్ లో అనుష్కను చూసిన అభిమానులు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: