ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘నాపేరు సూర్య’ మూవీ ప్రదర్శనలు ఈరోజు తెల్లవారుజాము నుండి మొదలు కావడంతో ఈమూవీకి వస్తున్న టాక్ గందరగోళంగా మారింది. అల్లు అర్జున్ అభిమానులు ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఉంటే ఈమూవీని చూసిన సాధారణ ప్రేక్షకులు మాత్రం ఈమూవీ ఫస్టాఫ్ ఒక మాదిరిగా ఉన్నా సెకండ్ ఆఫ్ బాగుంది అని అంటున్నారు. 
ఫస్టాఫ్ స్క్రిప్టు రివ్యూ
వక్కంతం వంశీ కథకు డైరెక్షన్ కు అదేవిధంగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్‌ కు మంచి మార్కులు పడుతున్నా టోటల్ గా ఈమూవీ యావరేజ్ మూవీ అనీ ఒక్కసారి మాత్రం చూడతగ్గ మూవీ అంటూ సగటు ప్రేక్షకుడు ఈమూవీ పై తీర్పు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈసినిమా కూడ మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమాకు రిపీట్ ఆడియన్స్ లేక చివరకు కలక్షన్స్ విషయంలో నిలబడలేక పోయినట్లుగా బన్నీ సినిమా కూడ ఒక వారం హడావిడి తరువాత చల్లారిపోతుందా అన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. 
 నా పేరు సూర్య కథ
ముఖ్యంగా ఈసినిమాలో సాంగ్స్ డిజప్పాయింట్ చేయడం సాధారణ ప్రేక్షకుడు పెదవి విరిచేలా చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో కొందరు ఈసినిమా నచ్చలేదంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఇక నటన విషయంలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అని సాధారణ ప్రేక్షకుడు కామెంట్స్ చేస్తూ ఉన్న నేపధ్యంలో ఈమూవీ పూర్తిగా బన్నీ వన్ మ్యాన్ షో అయిపోయింది అని వార్తలు వస్తున్నాయి. 
కథలో కీలక మలుపు
దీనితో ఈమూవీకి సంబంధించి ఒక స్టార్ డైరెక్టర్ లేకుండా కేవలం ఒక బన్నీ యాక్షన్ మాత్రమే నమ్ముకుని ఉద్వేగభరితంగా నిర్మింపబడ్డ ఈసినిమాకు సగటు ప్రేక్షకుడు ఈమూవీని చూడటానికి రెండవసారి రావడమనేది కష్టం అని అంటున్నారు. దీనితో ‘భరత్’ బయ్యర్లు ఇప్పుడు ఆసినిమా గురించి టెన్షన్ పడుతున్నట్లుగా సూర్య బయ్యర్లు కూడ ఈమూవీకి వస్తున్న ఈ డివైడ్ టాక్ ను చూసి టెన్షన్ పడుతున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: