రవితేజ నటిస్తున్న ‘నేలటికెట్’ సినిమా టీజర్‌ విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంటున్న నేపధ్యంలో ఈమూవీ పై అంచనాలు బాగా పెరిగాయి.  ‘సోగ్గాడే చిన్నినాయనా’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో  రూపొందుతున్న మూవీ కావడంతో ఈమూవీకి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
ఆడియో వేడుక తేదీ ఖరారు
ఈసమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీకి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈమూవీ ఆడియో ఫంక్షన్ ఈనెల 12వ తేదీన అత్యంత భారీగా చేయబోతున్నారు. అయితే అనూహ్యంగా ఈమూవీ ఫంక్షన్ కు అతిధిగా పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుగా అధికారిక ప్రకటన రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
మాళవిక శర్మ హీరోయిన్‌గా
సాధారణంగా మెగా హీరోల ఫంక్షన్స్ కు కూడ రాని పవన్ కొన్ని వ్యక్తిగత కారాణాల రీత్యా  ‘రంగస్థలం’ ఫంక్షన్ కు వచ్చినట్లు కామెంట్లు ఉన్నాయి. అయితే పవన్ కు రవితేజాకి ఏమాత్రం చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం లేని నేపధ్యంలో ఇప్పుడు ‘నేలటిక్కెట్’ ఫంక్షన్ కు అతిధిగా రావడం వెనుక కారణాలు ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 
ఒకే వేదికపై వాళ్లిద్దరూ
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఫంక్షన్ కు పవన్ రావడం వెనుక ఈ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరితో పవన్ కు ఉన్న సన్నిహిత సంబంధం అని అంటున్నారు. పైకి ఎక్కడా కనిపించకపోయినప్పటికీ వీళ్ళ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం చాల కాలం నుండి కొనసాగుతోంది అని టాక్. పవన్ ‘జనసేన’ పార్టీకి రామ్ తాళ్ళూరి ఇన్ డైరెక్ట్ గా ఫండింగ్ అందిస్తారని ‘జనసేన’ కు ఎప్పుడు ఏమి కావలసి వచ్చినా రామ్ ముందుంటా డని ఇండస్ట్రీ వర్గాల గాసిప్. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలలో రామ్ తాళ్లూరికి చెందిన కంపెనీ అన్ని వ్యవహారాలు దగ్గర ఉండి చూస్తుందని కూడ అంటారు. దీనితో ‘నేలటిక్కెట్’ ఆడియో ఫంక్షన్ వెనుక ‘జనసేన’ వ్యూహాలు ఉన్నాయి అంటూ గాసిప్పులు గుప్పుముంటున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: