చిత్రసీమ చరిత్రలో ఎప్పటికప్పుడు నూతన విధానాలను పరిచయం చేస్తూ ప్రపంచంలోని కొత్త కొత్త సాంకేతిక విధానాలను అలవరచుకోకపోతే మనం భారత్ లోకి దూసుకు వచ్చే హాలీవుడ్ సినిమాలను తట్టుకోలేమని బాలీవుడ్ సూపర్ స్టార్ బాద్షా అమితాబ్ బచ్చన్ ఇటీవల కాస్త ఘట్టిగానే చేప్పారు. ఉదాహరణకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహెష్ బాబు నటించిన "భరత్ అనే నేను" సినిమాపై హాలీవుడ్ సినిమా "అవెంజర్స్, ఇన్ ఫినిటీ వార్" దెబ్బపడింది. అందుకే మనం అన్ని రంగాల్లో ప్రపంచ వ్యాప్త సాంకేతికత తో అప్డేట్ కాకపోతే ఇండియా సినిమా మటాష్ అవ్వక తప్పదు. అది నిర్మాణం లో మాత్రమే కాదు సినిమా ప్రమోషణ్ లో కూడా! 
 footage screening for film publicity కోసం చిత్ర ఫలితం 
చిత్ర రంగంలో తన కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మసాలా సినిమాలే చేసినా, తర్వాత తన దిశ ఇదికాదని నూతన దశ కోసం తన రూటు మార్చాడు తెలుగువారైన  తమిళ హీరో విశాల్. వాణీజ్య అంశాల్ని మిళితం చేస్తూనే సృజనాత్మకతను మేళవించి వినూత్న విభిన్నమైన సినిమాలు చేసి మెప్పించారు. గత ఏడాది వచ్చిన విశాల్ సినిమా ‘తుప్పరివాలన్’ (తెలుగు డబ్ డిటెక్టివ్) విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతకు మించిన ప్రేక్షకాదరణ కూడా పొందింది. 
footage screening for film publicity కోసం చిత్ర ఫలితం
ఇప్పుడతను ‘ఇరుంబు తురై’ (తెలుగు డబ్ అభిమన్యుడు) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రం మే 11న రెండు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక వినూత్న ప్రయోగం చేయబోతున్నాడు హీరో-ప్రొడ్యూసర్ విశాల్. 'ఇరుంబు తురై' విడుదల కావడానికి రెండు రోజుల ముందే తమిళ మీడియా వాళ్లకు 'ఫుటేజ్ స్క్రీనింగ్' ఏర్పాటు చేశాడు విశాల్. ఇలా ఫుటేజ్ స్క్రీనింగ్ చేయడం హాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. సినిమాలోని కీలక సన్ని వేశాలు, వాటికి సంబంధించిన మేకింగ్ తదితర విశేషాలతో ఈ స్క్రీనింగ్ ఉంటుంది. దాదాపు గంటపాటు ఈ స్పెషల్ షో నడుస్తుందట. 
movies promotion in hollywood with Footage Screening కోసం చిత్ర ఫలితం
సినిమా చూడటానికి చూసే ముందు ప్రేక్షకులకు ఒక ఫీల్ & మూడ్ క్రియేట్ చేయడానికి ఈ ఫుటేజ్ స్క్రీనింగ్ ఉపకరిస్తుంది. ఇండియాలో ఇలాంటి ప్రమోషన్ ఇప్పటి వరకు కొత్త విషయమే. తెలుగు మీడియా కు కూడా ఇలాంటి స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారేమో చూడాలి. విశాల్ సరసన సమంత నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు పి.ఎస్.మిత్రన్ రూపొందించాడు. సీనియర్ నటుడు అర్జున్ ఇందులో నెగెటివ్ రోల్ చేయడం విశేషం.

irumbu thirai - abhimanyuDu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: