తెలుగు చిత్రపరిశ్రమను "ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి,  జమున, ఎస్విఆర్" ఒక నాలుగు దశాబ్ధాలు కలిసి యేలేశారు. ఒక చిన్న మాట - ఒక ఇంట్లో కొత్త దంపతులకు బిడ్డ పుట్టినట్లు తెలిస్తే ఆడబిడ్డా? మగబిడ్డా? అని తెలుసుకోవటానికి "సావిత్రా? నాగేశ్వరరావా?" అని అడిగే రోజులవి. వారి కలయిక అంత ప్రఖ్యాతం.

అలాగే ఎన్టీఆర్ ఒక మాస్ పాత్ర చెస్తే జోడీగా సావిత్రి నటించపోతే  ఆ సినిమాలు రక్తి గట్టేవి కావు. ఉదాహరణకు "గుండమ్మ కథ". ఎన్టీఆర్ మాస్-రోల్ చెస్తే హీరోయిన్  క్లాసైతే అది జమున అని చెప్పొచ్చు ఉదాహరణ "రాముడు భీముడు" ఇక విఖ్యాత ప్రతినాయకుడు కావాలంటే ఎస్వీఅర్ ఉండాలి ఎందుకంటే హీరోని ఆస్థాయికి ఎలవేట్ చెయ్యగలిగే నటసార్వభౌముడు ఎస్విఆరే. 
సంబంధిత చిత్రం
తెలుగు సినిమా చరిత్రగా చదువు కుంటున్నామంటే, చూస్తున్నామంటే "చారిత్రక హోదా" అద్దిందే ఈ పంచపాండవులు. ఇందులో నంబర్ వన్ సావిత్రి మాత్రమే. 
అయితే సావిత్రి ఎస్విఆర్ లను పక్కన బెడితే మిగిలిన వారికి అభిమానులు వేర్వేరు. కాని వీరిద్దరికి అందరూ అభిమానులే. ఇందులో సావిత్రి మళ్ళీ  నంబర్ వన్. ఇప్పుడు వయసు 50 యేళ్ళ పైబడ్ద వారికి మహానటి సావిత్రి తీయని ఙ్జాపకం. అంతకంటే చిన్నవారికి ఒక మధుర స్వప్నం. ఎందుకంటే మరోనటిని స్థాయిలో వారు చూడలేరు కాబట్టి.  అయితే ఇదంతా మహానటి  నిర్మాణంలో పస ఉంటేనే సాధ్యం.    
 mahanati movie images కోసం చిత్ర ఫలితం
ఇక రిలీజ్ అయ్యే సమయం, వాతావరణం పరిశీలిస్తే  "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమా అనుకున్నంత ఫేర్ చేయలేదు. "మిక్డ్స్-టాక్" తో కొన్ని విమర్శకు ల ప్రశంసలు, మరి కొన్ని 'ముఖం చిట్లింపులు, పెదవి విరుపుల' తో ఈ సినిమా రివ్యూలు, రేటింగులు వచ్చాయి. విడుదల ముందు భారీ అంచనాలను కలిగి ఉన్న ఈ సినిమా అందుకు తగ్గ ఓపెనింగ్స్‌ను పొందింది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుంది? ఎంత పెద్ద హిట్ అవుతుంది? అనేది ఇంకొన్ని రోజులు చూడాలి. 'భరత్ అనె నేను' విడుదల అయిన తరవాత వారానికే 'అవెంజెర్స్' అనే హాలీవుడ్ సినిమా వేసిన వేటుకి భరత్ తల్లడిల్లాడు.  
anr savitri & Ntr savitri in one frame కోసం చిత్ర ఫలితం
అయితే మహానటికి పరిస్థితుల సానుకూలత అవసరంలేదు. కొన్ని కోట్ల మంది ముందు తరం ప్రేక్షకులు చాలు ఈ సినిమా విజయోత్సవం జరుపుకోవటానికి. అంతకు మించి ఈ తరం ప్రేక్షకులు ఇన్స్పైర్ అయితే ఈ సినిమా జరుపుకునే ఉత్సవానికి ఏ పేరు పెట్టాలో?  ఆలోచించుకోవాలి.  అయితే ఇదంతా అందరికీ తెలిసిన సావిత్రి కథ కావటం అదే సరిగా సినిమాలో ప్రతిబింబింబిస్తే మాత్రమే సాధ్యం. సినిమా నిర్మాణంలో ఆ నాణ్యత ఆ సృజనాత్మకత తేగలిగితేనే అనితర విజయం సాధ్యం.
anr savitri & Ntr savitri in one frame కోసం చిత్ర ఫలితం
ఇక ఆ విషయం అలా ఉంచితే ఏ మాత్రం గ్యాప్ లేకుండా మరిన్ని ఆసక్తిదాయకమైన సినిమాలు రాబోతున్నాయి. వచ్చేవారం లో విడుదల కానున్న సినిమాలు అప్పుడే ప్రచారపర్వాన్ని మొదలుపెట్టేశాయి. "మహానటి" మే తొమ్మిదో తేదీన విడుదల కాబోతోంది. అంతకన్నా ముందురోజునే, అంటే మే 8వ తేదీనే యూఎస్‌ లో ప్రీమియర్స్ ప్రదర్శన ఉంటుంది.
అంచనాలు పెంచేస్తున్న ‘మహానటి’ పోస్టర్స్
అటు క్లాస్‌ లో ఇటు మాస్ లో అమితాసక్తిని రేపుతున్న మిడ్-రేంజ్-బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. "మహానటి" సావిత్రి జీవితం సినిమా ప్రియులందరికీ ఆసక్తిదాయక మైనదే. 70 యేళ్ల వయసు వారి దగ్గర నుంచి టీనేజ్ పిల్లల వరకూ అందరూ ఈ సినిమా పై ఆసక్తితో ఉన్నారు. కుటుంబ సమేతంగా సినిమా వీక్షకులకు ఈ సినిమాకు వరదై వచ్చే  అవకాశం ఉంది. "మల్టీప్లెక్స్ ఆడియన్స్‌" కు ఇంతకు మించిన అమితానంద కరమైన సినిమా లేదు.
anr savitri & Ntr savitri in one frame కోసం చిత్ర ఫలితం
సావిత్రి జీవిత పరిణామాల పరంపర గురించి ప్రేక్షకులలో ఉన్న రకరకాల ప్రచారాల నేపథ్యంలో అసలేం జరిగింది? ఈ సినిమాలో ఏం చూపిఉంటారు? అసలు జెమిని గణేషన్ ఎంతటి కౄరుడు? సావిత్రి ఎందుకు జెమిని విషయంలో బలహీనురాలైంది? అనే విషయాలను తెలుసుకోవడానికి అనేక మంది థియేటర్లకు వరసగట్టేఅ అవకాశం ఉంది. 
all eyes on mahanati
అచ్చం సావిత్రిలా కనిపిస్తున్న కీర్తీ సురేష్ పోస్టర్లు సినిమా పై ఆసక్తిని పలువిధాలుగా పెంచేశాయి. ఇలాంటి అంచనాల మధ్యన రాబోతున్న సావిత్రి జీవిత కథా చిత్రం  (బయోపిక్) ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అనుభవాన్ని మిగుల్చుతుందో నని ఆశక్తి దాయకంగా తెలుగు ప్రేక్షకులు మే 9వ తేదీ కోసం నిరీక్షిస్తున్నారు. 

anr savitri & Ntr savitri in one frame కోసం చిత్ర ఫలితం

మగువలను మహరాణులనుచెసే సామర్ధ్యమున్నచరిత్ర మహానటి సావిత్రిదే! మరొకరికి అంత గొప్ప జీవితకథ ఉందా? అనేది ప్రశ్నార్ధకమే. ఇంతటి డెప్త్ - మలుపులు మెరుపులు, ఏత్తుపల్లాలు, కష్టసుఖాలు, యుక్తులు కుయుక్తులు, ఇంకెన్నో ప్రవాహంలా జలజలారావాలు కొన్నిచోట్ల మందాకినిలా గంభీర సాగరంలా సాగే కథ ఇది. జీవిత మంత కథ - కథ నిండా అనుకోని మలుపులు - అందుకే ఈ సినిమా టేకింగ్ లో ఉండాల్సింది పరిపక్వత. బహుశ నాగ్ అశ్విన్ లో అది ఉండవచ్చనే నమ్మకంతో అశ్వనీదత్ ఈ సినిమా నిర్మాణం అంగీకరించి ఉండొచ్చు. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రేక్షకుల డిసప్పోయింట్మెంట్ చాలా భరించలేనిదిగా ఉంటుంది.   
అంచనాలు పెంచేస్తున్న ‘మహానటి’ పోస్టర్స్

మరింత సమాచారం తెలుసుకోండి: