ఈవారం విడుదల కాబోతున్న ‘మహానటి’ తన మూవీ విడుదల విషయమై ఒక సాహస పూరితమైన ప్రయోగం చేస్తోంది. సాధారణంగా సినిమాలు అన్ని గురువారం కాని లేదా శుక్రు వారం విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఈపద్ధతికి బ్రేక్ ఇస్తూ సావిత్రి జీవితంపై రూపొందించిన ‘మహానటి’ మూవీ ఈవారం బుధవారం రోజున విడుదల చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. వాస్తవానికి టాప్ హీరోల సినిమాలు అయితే ఏ వారం విడుదల అయినా వాటి ఓపెనింగ్స్ విషయంలో ఎటువంటి సమస్యలు రావు. 
mahanati movie latest photos కోసం చిత్ర ఫలితం
అయితే సావిత్రి జీవితం పై ఒక బయోపిక్ గా తీసిన ఈమూవీ ఈవారం 9వ తారీఖు బుధవారం విడుదల కావడం వెనుక ఒక బలమైన సెంటిమెంట్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ  వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలు వచ్చినా వాటి అన్నింటిలోకి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సాధించిన ఘన విజయం వైజయంతీ మూవీస్ నిర్మించిన మరి ఏసినిమాకు రాలేదు. 1990 మే9న విడుదలైన ఆ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. 
mahanati movie latest photos కోసం చిత్ర ఫలితం
అటువంటి సెంటిమెంట్ ను నమ్ముకుని ‘మహానటిని’ కూడా మే 9న విడుదల చేయాలని అశ్వనీదత్ నిర్ణయించుకున్నాడు. దక్షిణాది సినిమారంగంలో ఎందరో ప్రముఖ నటీమణులు ఉన్నా సావిత్రి స్థాయిలో దశాబ్దాలుగా సినీ ప్రేక్షకుల గుండెలలో నిలిచిపోగల నటి ఇప్పటివరకు రాలేదు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించింది అనివార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ తరువాత ఈ మూవీ పై బాగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.
mahanati movie latest photos కోసం చిత్ర ఫలితం
గత కొంత కాలంగా ‘కంత్రి’ ‘శక్తి’ లాంటి భారీ సినిమాలు తీసి భారీ డిజాస్టర్స్ కొని తెచ్చుకున్న అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంకా దత్ స్వప్న దత్ లు నిర్మాతలుగా మారి అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ విజయం పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈమధ్య కాలంలో చాల సినిమాలు ఊహించని ఘన విజయాలు సాధిస్తున్న నేపధ్యంలో చిరంజీవి సెంటిమెంట్ ఎంత వరకు ‘మహానటి’ ని కాపాడగలుగుతుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: