నందమూరి బాలకృష్ణకు జాతకాలు అన్నా వాస్తు విషయాలు అన్నా విపరీతమైన నమ్మకం. బాలయ్య తాను నటించే సినిమాల విడుదల తేదీ ముహూర్తాలనే కాకుండా ఆసినిమా ఆడియో ఫంక్షన్ తేదీ ముహూర్తాలను కూడ నిర్ణయిస్తాడు అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో బాలయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలి అని ప్రయత్నాలు చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఊహించని సమస్యలు రావడం వెనుక వాస్తు కారణాలు ఉన్నాయి అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
ntr bio pic photos కోసం చిత్ర ఫలితం
అత్యంత అట్టహాసంగా ప్రారంభింపబడ్డ ఈ బయోపిక్ కు ఆది నుంచి సమస్యలు ఎదురౌతూనే ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు తేజ ఈమూవీ ప్రాజెక్ట్ నుండి పక్కకు తప్పుకున్న తరువాత బాలకృష్ణ టెన్షన్ మరింత పెరిగిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. రాబోయే సంవత్సరం ఎన్నికల కాలం కాబట్టి ఆ ఎన్నికల లోపే ఏమాత్రం వీలున్నా ఈ దసరాకు ఈసినిమాను విడుదల చేయడానికి బాలయ్య అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. 
ntr bio pic photos కోసం చిత్ర ఫలితం
అయితే ఈసినిమాకు ఆది నుంచి ఆటంకం ఎదురవ్వడంతో బాలయ్య తన  జ్యోతిష్కులను సంప్రదించినట్లు తెలుస్తోంది. తాను ఎంతో ఆశలుపెట్టుకుని మొదలు పెట్టిన ఈమూవీకి ఈఅనుకోని సమస్యలు ఏమిటి అని బాలయ్య తన జ్యోతిష్కులను ఆరా తీస్తే వారు ఆలోచించి కొన్ని షాకింగ్ విషయాలు బాలకృష్ణ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈసినిమా నిర్మాణానికి సంబంధించి బాలయ్య తీసుకున్న ఆఫీస్ లో వాస్తు లోపాలు ఉన్నాయని వాస్తు లోపాలు ఉన్నాయని వాస్తు పండితులు గుర్తించినట్లు సమాచారం. 
ntr bio pic photos కోసం చిత్ర ఫలితం
దీనికితోడు ఈసినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలూ నిర్వహిస్తున్న ఆఫీస్ ఇప్పటికే ఎన్నో అపజయాలు ఎదుర్కొంటున్న ఒక సీనియర్ నిర్మాతకు సంబంధించింది అని తెలుస్తోంది. దీనితో సెంటిమెంట్ రీత్యా బాలయ్య తన ఎన్టీఆర్ బయోపిక్ కు కొత్త ఆఫీసును వెతికే పనిలో పడ్డాడట. మరి ఈకొత్త ఆఫీసు దొరికిన తరువాత అయినా ఎన్టీఆర్ బయోపిక్ కు ఏర్పడుతున్న ఆడ్డంకులు తొలిగిపోతాయేమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: