మా ఐదేళ్ళ పాప నీ కిష్టమైన పాత పాట ఏంటమ్మా? అంటే తడుముకోకుండా చెప్పే పాట "వివాహ భోజనంబూ! వింతైన వంటకంబు!" సరిగ్గా 60యేళ్ళ క్రితం పాట. అపాత మధురం. పింగళి నాగెందరరావు రాసిన ఆ పాటకు స్వరం అందించిన వారు మాధవపెద్ది సత్యం. సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు. కదిరి వెంకట రెడ్డి దర్శకత్వంలో నటసార్వభౌమ ఎస్వి రంగారావు నటన అనితర సాధ్యం. అయితే అలనాటి అందాల ]తార మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా "మహానటి" పాత్రలో కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌ పోషించారు. 

SVR & Mohan babu కోసం చిత్ర ఫలితం

సమంత, విజయ్‌ దేవరకొండ ప్రధానపాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ స్వర బాణీలు అందించారు. మే 9న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల నేపథ్యంలో ఒక్కో పాత్రపై వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా లో నాటి మేటి దర్శక నిర్మాతలు ఎల్వీ ప్రసాద్‌ పాత్రలో  అవసరాల శ్రీనివాస్‌, కేవీ రెడ్డి పాత్రలో క్రిష్‌ కనిపించనున్నారంటూ ప్రకటించిన చిత్ర బృందం శనివారం నాని చేతుల మీదుగా వీడియోలను విడుదల చేసింది. 

SVR & Mohan babu కోసం చిత్ర ఫలితం
కాగా నిన్న ఆద్ఫివారం రోజున ఈ భువి ప్రత్యమ్నాయం లేని ప్రపంచ ప్రఖ్యాత జెనీవ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన అవార్డ్ తెలుగు కళామతల్లికి అందించిన ఎస్వీ రంగారావు పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని పంచుకుంది. ఇందులో మోహన్‌ బాబు ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించి, ఆకట్టుకున్నారు.
పాత్రయేదైనా, జానర్ ఏదైనా, ఆయనకు ఒక పాత్రలో విలీనమై పోవటం కరతలామలకం కొట్టిన పిండి. పౌరాణికమైనా, సాంఘీకమైనా, జానపదమైనా, చారిత్రాత్మకమైన ఏ పాత్రలో నైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు మన ఎస్వీ రంగారావు. అందరికీ ఆల్టర్నేటివ్ దొరుకుతారు ప్రత్యామ్నాయం దొరకని ఒకే ఒక నటుడు ఎస్వీఆర్. మహానటి సావిత్రిని చాలెంజ్ చేసి నటించగల నటుడు భారత చలన చిత్ర రంగంలో "సామర్ల వెంకట రంగారావు"  మాత్రమే. సంక్షిప్తంగా ప్రజలకు ఆయన "ఎస్వీఅర్"  

"వివాహ భోజనంబు" అంగానే "వింతైన వంటకంబు" అనని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్వీ రంగారావుదే. అలాంటి మహానటుడిని మాయ శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందారు మన మహానటి సావిత్రి. SVR & Mohan babu కోసం చిత్ర ఫలితం
అలాంటి మహానటుడి పాత్రలో మనముందుకు రాబోతోంది ఎవరు అనుకుంటున్నారా? అవును.. మీ ఊహ నిజమే.. "వన్‌ అండ్‌ ఓన్లీ" డాక్టర్‌ మోహన్‌బాబు గారికే అది సాధ్యం - అంటూ నాని ఆ పాత్రను వీడియోలో పరిచయం చేశారు.

SVR & Mohan babu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: