టాలీవుడ్ టాప్ హీరోల జీవన సరళితో పోలిస్తే కోలీవుడ్ టాప్ హీరోలు సమాజం గురించి చాల ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. విశాల్ సూర్య లాంటి టాప్ హీరోలు ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ తమని హీరోలు చేసిన కోలీవుడ్ ప్రేక్షకులకు పరోక్షంగా సహాయం చేస్తూ తమ సామాజిక స్పృహను కొనసాగిస్తున్నారు. 
KOLLYWOOD TOP HERO SURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రతి సంవత్సరం తాము సంపాదించే కోట్లాది రూపాయలలో కొంత శాతాన్ని ఖచ్చితంగా సామాజిక కార్యక్రమాలకు కోలీవుడ్ టాప్ హీరోలు వినియోగిస్తున్నారు. ఇప్పటికే ‘అగరం’ అనే పేరుతో సామాజిక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన సూర్య కోట్లాది రూపాయలలో సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నారు. 
KOLLYWOOD TOP HERO SURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తమ కుటుంబానికి సంబంధించి చెన్నైలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఇంటిని ఈ ఫౌండేషన్ కోసం ఉదారంగా ఇచ్చేసిన సూర్య ఇక పై ప్రతి సంవత్సరం తన సినిమాల నుండి వచ్చే ఆదాయంతో 500 మంది కాలేజీ విద్యార్థులకు అండగా నిలుస్తానని సూర్య బహిరంగంగా ప్రకటించడం కోలీవుడ్ మీడియాలో సంచలన వార్తగా మారింది.   ఈవార్త వైరల్ కావడంతో సూర్య అభిమానులు అంతా సూర్యకు సెల్యూట్ చేస్తున్నారు.
సంబంధిత చిత్రం
టాలీవుడ్ హీరోల భారీ పారితోషికాలతో పోల్చుకుంటే కోలీవుడ్ హీరోలకు అంత స్థాయిలో భారీ పారితోషికాలు ఉండవు. ఇలాంటి పరిస్థుతులలో కూడ కేవలం ఎదో ఆదాయపు పన్ను మినహాయింపు కోసం కాకుండా నిజమైన ప్రజా సేవ చేయడానికి సూర్య అనుసరిస్తున్న పద్ధతి మన టాలీవుడ్ హీరోలు కూడ అనుసరిస్తే బాగుంటుంది అన్న కామెంట్స్ వస్తున్నా ఇలాంటి విషయాలను ప్రస్తుతం కలక్షన్స్ లెక్కలలో బిజీగా ఉన్న మన టాప్ హీరోలు పట్టించుకునే ఆస్కారం లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: