తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’, ‘బాహుబలి2’.  ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు తెలుగు సీనీ చరిత్రలో చెరగని రికార్డులు సృష్టించాయి.  అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ అంటే అంతంత మాత్రం మాట్లాడుకునే వారు..బాహుబలి సీరీస్ చూసి బెంబేలెత్తిపోయారు.  ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ లో అయితే తామే రికార్డులు సృష్టిస్తామని మీమాంసలో ఉండేవారు..ఇక బాహుబలి 2 ప్రభంజనం చూసి షాక్ తిన్నారు. 
Image result for baahubali 2
ఈ చిత్రం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపింది.   కలెక్షన్స్ పరంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఓ ఊపు ఊపేసిన ఈ చిత్రం ఏప్రిల్ 4న చైనాలో రిలీజ్ అయింది. దాదాపు 7000 స్క్రీన్స్ లో విదుదల కాగా మొదటి రోజే 2.85 మిలియన్ డాలర్లను రాబట్టి ఇండియన్ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది.   అంతే కాదు  ఇక రెండు, మూడు రోజులలో అదే జోరును కొనసాగించి మొత్తంగా 7.8 మిలియన్ డాలర్లను ఖాతాలో వేసుకుంది. 
Image result for baahubali 2
ఈ వారం కూడా ఇదే రేంజ్ కొనసాగితే..మరో రికార్డు కూడా క్రియేట్ చేయబోతుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ప్రస్తుతం గ్రాస్ పరంగా చూస్తే.. 52 కోట్లు సాధించింది. దీని వల్ల బాహుబలి వరల్డ్ వైడ్ వసూళ్లు మరింత పెరగనున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలలో నటించగా, రమ్య కృష్ణ, నాజర్, సత్య రాజ్ లు కీలక పాత్రల్లో మెరిశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా పై నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: