తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ‘విక్రమ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున...తర్వాత రొమాంటిక్ చిత్రాలతో అమ్మాకుల మన్మధుడిగా మారిపోయాడు. ఆ తర్వాత కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు.  తెలుగు నాట‌ గ‌త మూడు ద‌శాబ్దాలుగా అగ్ర క‌థానాయ‌కుడిగా రాణిస్తున్నారు అక్కినేని నాగార్జున‌.  కేవ‌లం తెలుగు సినిమాల‌కే ప‌రిమితం కాకుండా.. హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ సంద‌డి చేశారు. బాలీవుడ్‌, కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ త‌న‌దైన ముద్ర వేశారు.  అయితే ఇప్పటి వరకు నాగార్జున్ మళియాళ ఇండస్ట్రీలో కనిపించలేదు.
Image result for mohan lal nagarjuna
తాజాగా అక్కడ కూడా తన సత్తా చాటబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ రూపొందించ‌నున్న‌ చిత్రం ‘మరక్కర్: అరబికడలింతే సింహం’. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం నాగార్జునను సంప్రదించినట్లు టాక్. అయితే తన పాత్ర, కథ ఎంతో నచ్చడంతో నాగ్ కూడా ఈ సినిమాలో నటించడానికి సుముఖంగా ఉన్నట్లు స‌మాచారం.
Image result for allu arjun ntr
ఒక వేళ నాగ్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే.. ఆయన నటించే తొలి మలయాళ చిత్రం ఇదే అవుతుంది. త్వ‌ర‌లోనే నాగ్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. ఈ మద్య మళియాళ హీరోలు తెలుగు తెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  ఇక మాళీవుడ్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ చిత్రం ‘నా పేరు సూర్య’ మాళీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.   
Image result for sunil shetty
ఇక నాగార్జున నటించబోయే ఈ చిత్రంలో  బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి నటించనున్నారు. అంతేగాకుండా.. ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ చిత్రాల సినిమాటోగ్రాఫర్  తిరు ఈ సినిమాకి ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్నారు. అలాగే.. ‘బాహుబలి’ మూవీకి ప్రొడక్షన్ డిజైన‌ర్‌గా ప‌ని చేసిన సాబు సైరిల్ ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. నవంబర్ 1 నుంచి సెట్స్ పైకి వెళ్ళే ఈ చిత్రం గురించి మరిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: