తెలుగు తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల న‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రంకి యూ స‌ర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్‌. 2 గంటల 59 నిమిషాల ర‌న్‌టైం ఈ చిత్రానికి ఉండ‌డంతో సినిమాలో ఏఏ అంశాలు చూపిస్తారా అని అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రంలోని పాత్రలకు సంబంధించి ఒక్కో వీడియోను నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. 
Image result for మహానటి ప్రకాశ్ రాజ్
ఇప్పటికే అవసరాల శ్రీనివాస్, దర్శకులు క్రిష్, మోహన్ బాబు, షాలిని పాండే పాత్రలకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేయగా..విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు.  తెలుగింట ఆవకాయ లేని వంటగది, చందమామ కథలు లేని బాల్యం బహుషా లేవేమో! మనందరి మొదటి కథలను మనకు అందించిన మహా రచయిత బహుబాషా పండితుడు, నిర్మాత, దర్శకుడు చక్రపాణి.
Image result for మహానటి ప్రకాశ్ రాజ్
చందమామ విజయా కంబైన్స్ స్థాపకుల్లో ఒకరైన చక్రపాణి మహానటి సావిత్రి నట జీవితంలో కలికితురాయి లాంటి గుండమ్మ కథ, మిస్సమ్మతో పాటు ఎన్నో చిత్రాలు మనకు అందించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అలనాటి చక్రపాణి గారి పాత్రలో ఇపుడు మనకు కనిపించబోతున్నారు యావత్ భారత్ దేశం గర్వించే గొప్ప నటుల్లో ఒకరైన ప్రకాష్ రాజ్ అంటూ వాయిస్ ఒవర్ తో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 
Related image
స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. వీరితో పాటు రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, శాలిని పాండే, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "మహానటి" చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: