అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం ఇటీవల విడుదలయింది. కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.   దర్శకుడిగా పరిచయమవుతూ వక్కంతం వంశీ 'నా పేరు సూర్య' సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ రెండు చిత్రాల హవా
అల్లు అర్జున్ కి గల క్రేజ్ కారణంగా తొలిరోజునే ఈ సినిమా 38 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్లను రాబట్టింది. దేశభక్తి కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ మాన్ గా కనిపించాడు. బన్నీ అద్భుతమైన పెర్ఫామెన్స్ చేసాడనే ప్రశంసలు దక్కాయి.  రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాల హవా సాగుతున్న సమయంలో అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం విడుదలయింది.
మిశ్రమ స్పందన
మొత్తానికి  బన్నీకి ఉన్న స్టార్ ఇమేజ్ తో ఈ చిత్రం తొలి వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ చిత్రం 83 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఐదురోజుల్లో గ్రాస్ 100 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం. మరో వైపున ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశపరిచే విషయం.   


మరింత సమాచారం తెలుసుకోండి: