తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ ఎంతో గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.  చిన్న చిత్రంగా రిలీజ్ అయిన ‘ఫిదా’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి..కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. తమిళ, మళియాళ ఇండస్ట్రీలో కూడా ఈ అమ్మడు మంచి క్రేజ్ సంపాదించింది. ఆ మద్య నానీ హీరోగా'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాతో మరింత క్రేజ్ ను పెంచుకుంది.   ఈ మద్య ‘కణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాయి పల్లవి. 

చిన్న హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్ వరుస విజయాలు సాధిస్తూ మినిమం గ్యారెంటీ హీరోగా మారారు.   హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచె మనసు' చిత్రంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ రోజున సాయిపల్లవి పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. 'హోలీ' పండగ నేపథ్యంలో ఆనందంతో సాయిపల్లవి డాన్స్ చేసే పోస్టర్ ఒకటైతే, శర్వానంద్ .. సాయిపల్లవి ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ పరుగులు తీస్తున్నట్టుగా వున్న పోస్టర్ మరొకటి.

హను రాఘవపూడి ఎంచుకునే కథలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పలువురు సెలబ్రెటీలు సోషల్‌మీడియా ద్వారా సాయిపల్లవికి విషెస్‌ తెలుపుతున్నారు. ‘పడి పడి లేచే మనసు’ మూవికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతమందించగా, ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  సాయి పల్లవికి ఏపిహెరాల్డ్.కామ్ తరుపు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు.



మరింత సమాచారం తెలుసుకోండి: