తాజాగా టాలీవుడ్ పరిశ్రమలో హాటెస్ట్-టాపిక్ "మహానటి" – “మహనటి సావిత్రి” జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా తొలినుండే హిట్-టాక్ తో దూసుకుపోతుంది. సావిత్రి అంటే తెలుగువాళ్లకు అంత అభిమానం. పరిశ్రమకు చెందినవారే కాదు, పరిశ్రమేతరులు ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత చిత్రం 

అయితే టాలీవుడ్ ప్రసిద్ధ దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం ఈ సినిమా విడుదల సందర్భంగా ఒక అద్భుత విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. సరిగ్గా 28ఏళ్ల క్రితం ఇదే రోజున వైజయంతి మూవీస్ నిర్మించిన "జగదేకవీరుడు అతిలోక సుందరి" సినిమా విడుదలైందని అలాగే నేడు వైజయంతి మూవీస్ ఆద్వర్యంలో నిర్మంచబడ్డ మహానటి అంతే విజయాన్ని స్వంతం చేసుకోనుందని, వైజయంతి మూవీస్ తన ప్రతిష్టను మరోసారి నిరూపించు కుంటుందని తన ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత చిత్రం

"జగదేకవీరుడు అతిలోక సుందరి" (JV-AS) సినిమా పెద్దసినిమా తీశామనే ఆనందం ఒక వైపు, ఎలా ఆడుతుందనే భయం మరోవైపు, అదే సమయంలో భారీ వర్షం వరదలు. ఎప్పుడు ప్రకృతి శాంతి స్తుందనే ఎదురుచూపు.  అంతా ఒకరకమైన టెన్షనే నని అన్నారు.

 raghavendra rao comments on mahanati కోసం చిత్ర ఫలితం

ఎట్టకేలకు వాతావరణం సాయంతత్రానికి శాంతించగా ప్రేక్షక జనాలు సినిమాకు రావడం మొదలు పెట్టారు. మా దత్ (అశ్వనీదత్) గారికి ఆరోజు ఎంత ఆనంద పడ్డరో  ఇప్పటికీ మర్చి పోలేదు. అదే రోజున నేడు "మహానటి" విడుదలైంది. మహానటి - జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదలైన రోజే విడుదలై చరిత్ర పునరావృతం చేసింది

సంబంధిత చిత్రం 

అప్పుడు జగదేకవీరుడు అతిలోకసుందరి నిర్మించాలంటే ఎంత ధైర్యం కావాలో ఇప్పుడు మహానటి నిర్మించటానికి కూడా అంతే ధైర్యం కావాలి. మహానటిని సావిత్రిగారి చరిత్రను తెరపైకి తీసుకురావాలంటే ఎంత సాహసం కావాలో? అంత సాహసం గా తరతరాలకు అందించిన వైజయంతి మూవీస్ కు ధన్యవాదాలు.  కీర్తి సురేష్, సావిత్రి పాత్రలో, దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ పాత్రలో జీవించారు. కీర్తి నటన అద్భుతం, నాగ్ అశ్విన్ కు చిత్రబృందానికి అభినందనలు అని తెలిపారు.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: