నిన్నవిడుదలైన ‘మహానటి’ కి సూపర్ హిట్ టాక్ రావడంతో ఈమూవీ నిర్మాతలు మంచి జోష్ లో  ఉన్నారు. వాస్తవానికి ‘మహానటి’ కి మన తెలుగురాష్ట్రాలలో చెప్పుకోతగ్గ స్థాయిలో ఎక్కువ థియేటర్లు దొరకలేదు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమూవీకి బిజినెస్ కూడ అంతంత మాత్రంగా జరగడంతో ముందుగా ఎవరూ ఈమూవీ రేంజ్ ని అంచనా వేయలేకపోయారు. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
మొదట్లో ఈసినిమాకు వరల్డ్ వైడ్ గా పది కోట్ల కలక్షన్స్ వస్తే చాలఅదృష్టం అని చాలామంది భావించారు. అయితే ఈమూవీ వారం మధ్యలో విడుదల అయినా నిన్న మాట్నీషో నుండి ఏ థియేటర్స్ లోను ఒక్క టికెట్ కూడ మిగలకపోవడం అందరికీ ఆశ్చర్యాని కలిగిస్తోంది. తెలుస్తున్న  సమాచారం మేరకు ఈమూవీ ప్రదర్శింప పడుతున్న ధియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే బిసి సెంటర్లలోని ధియేటర్లకు సంబంధించి ఈమూవీ పై స్పందన అంతంత మాత్రంగానే ఉన్నా అర్బన్ సెమీ అర్బన్ సెంటర్లలో ‘మహానటి’ కలక్షన్స్ ఊహకందని స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. అయితే ‘మహానటి’ మ్యానియాతో కొన్ని సినిమాల విడుదల తేదీలు వాయిదా పడే అవకాసం ఉంది అనిఅంటున్నారు. కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాలు వచ్చే వారం విడుదల రావలసి ఉన్నా ‘మహానటి’ మ్యానియాతో ఈసినిమాల రిలీజ్ డేట్ లో మార్పులు వస్తాయని తెలుస్తోంది. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే పూరి జగన్నాథ్ ‘మెహబూబా’ రవితేజ ‘నేల టిక్కెట్’ సినిమాలు ఎంతవరకు ‘మహానటి’ కలక్షన్స్ ను దెబ్బ కొడతాయి అన్నవిషయం ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. ఇది ఇలా ఉండగా ‘మహానటి’ విడుదలకు ముందు ఈమూవీ శాటిలైట్ రైట్స్ 10 కోట్లకు అమ్మడం కష్టమైన నేపధ్యంలో ఇప్పుడు ఈమూవీ టాక్ ను విని 20 కోట్లకు ‘మహానటి’ శాటిలైట్ రైట్స్ ను తీసుకుంటాము అని రెండు ఛానల్స్ పోటీ పడుతున్నాయి అంటే ‘మహానటి’ అశ్వినీదత్ కు ఎంతటి అదృష్టాన్ని ఇచ్చిందో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: