తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడి బాలాజీపై జూనియర్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.   తన భార్యకు కిడ్నీ ఇస్తే..రూ.20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారని..కానీ ఇప్పటి వరుకు రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చి తప్పుడు పత్రాలతో తనను దారుణంగా మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో శ్రీరెడ్డి సహాయం తీసుకున్నానని..ఆమెతో వచ్చి ఫిర్యాదు చేసినట్లుగా బాధితురాలు తెలిపింది. అంతే కాదు తనకు సినిమాల్లో వేషాలతో పాటు రూ. 20 లక్షలు ఇస్తానని ఆశ పెట్టి కిడ్నీ తీసుకున్నారని భాగ్యలక్ష్మి కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
సినీ నటుడు బాలాజీపై జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి ఫిర్యాదు
నటి భాగ్యలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కిడ్నీ మార్పిడి వ్యవహారం చట్ట ప్రకారం సాగిందా? లేదా? అన్న కోణంలో విచారించిన పోలీసులు బాలాజీని పలు ప్రశ్నలు అడిగారు. అయితే భాగ్యలక్ష్మి నుంచి కిడ్నీ సేకరణకు ముందు జరిగిన చర్చలు..రాత పూర్వకంగా ఎలాంటి చర్చలు జరిగాయన్న విషయంపై పోలీసులు విచారణ చేశారు.
Image result for actor balaji police case
కాగా, తాము చట్టప్రకారమే ఆమె నుంచి కిడ్నీ తీసుకున్నామని..ఒప్పంద పత్రాలపై సంతాకాలు తీసుకున్నామని..అందులో ఎలాంటి మోసాలకు పాల్పడలేదని అంతే కాదు తాను మానవతా దృక్పథంతో ఆమెపట్ల వ్యవహరించానని బాలాజీ తెలిపినట్లు సమాచాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: