ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా  రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం “నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటించారు. రామ్ తాళ్లూరి సోష‌ల్ స‌ర్వీస్‌లో భాగంగా `నేల టిక్కెట్ ` చిత్రంలో ర‌వితేజ వాడిన క్యాష్‌ను దివ్యాంగుల‌కు ఇచ్చారు. ఎస్ ఓ ఎస్ సంస్థ‌కు రూ.ల‌క్ష‌ చెక్ అందించారు. ఎస్ ఓ ఎస్ ర‌వీంద్ర‌కుమార్ అందుకున్నారు.


ఈ వేడుకకు హాజరైన రవితేజ మాట్లాడుతూ, ‘పదేళ్ల క్రితం ఒకరికి నేను ఫోన్ చేశాను. ఆ వ్యక్తి పక్కన పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్.. ‘మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండి?’ అని అన్నారు. ఈ కాంప్లిమెంట్ ను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇది వరకు ఇధ్దరం బాగానే కలుసుకుంటూ ఉండే వాళ్లం. ఇప్పుడు బిజీ అయిపోవడంతో కలవలేకపోతున్నాం.  ఇక ‘నేలటిక్కెట్టు’ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా విజయం సాధిస్తుంది’ అని రవితేజ అన్నాడు. 


క‌ల్యాణ్‌గారు చాలా సింపుల్ వ్య‌క్తి. ఆయ‌న కేర‌క్ట‌ర్ గురించి తెలిసిన వాడిగా నేను ఈ సినిమా హిట్ అవుతుంద‌ని చెబుతున్నాను. ర‌వితేజ‌గారి సినిమాను నేను థియేట‌ర్ల‌లో చూసిన‌ప్పుడు ఓ మేరేజ్ హాల్‌కి వెళ్లిన‌ట్టు అనిపిస్తుంది. ఆడియ‌న్స్ ఆయ‌న్ని హీరోలా కాకుండా, ఓ ఫ్యామిలీ మెంబ‌ర్‌లాగా చూసుకుంటార‌ని అర్థ‌మైంది`` అని చెప్పారు.  


జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ ``నేను ఎలాంటి పాత్ర‌లు చేసినా ప్రేక్ష‌కులు అభినందిస్తున్నారు. అలాంటి పాత్ర‌లు చేసి, చేసి అలాగే మారిపోతానేమోన‌ని అనిపిస్తోంది. నేను ద‌శాబ్దం క్రిత‌మే ప‌వ‌న్ వ్య‌క్తిత్వం అంటే ఇష్ట‌మ‌ని చిరంజీవిగారితో చెప్పాను. `బ‌డ్జెట్ ప‌ద్మనాభం` సినిమా చేసేట‌ప్పుడు నేను హీరో, ర‌వి కేర‌క్ట‌ర్‌. ఆ సినిమాలో ఎలా ఉన్నాడో... ఇప్పుడూ అలాగే ఉన్నాడు. అదే ఫ్రెండ్లీనెస్ ఇప్ప‌టికీ ఉంది. మాస్‌, క్లాస్ అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ సినిమా రామ్‌గారు, ఆయ‌న భార్య ర‌జ‌నీగారికోస‌మైనా హిట్ కావాలి`` అని అన్నారు.


జెమిని కిర‌ణ్ మాట్లాడుతూ ``మా చంటిగాడు లోక‌ల్ నేల టికెట్ అని వ‌స్తున్నాడు. ఇంక అంద‌రికీ జింతాతా జింతాతానే`` అని చెప్పారు. 
ద‌ర్శ‌కుడు ఆనంద్ మాట్లాడుతూ ``ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. శక్తికాంత్ సంగీతం బావున్నాయి. నేల‌టికెట్ ఎలాంటి డౌట్ లేకుండా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత రామ్‌గారు చాలా పెద్ద ఎఫెర్ట్ పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: