తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్.  గజినితో తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సూర్య ‘సింగం’ సీరిస్ తో బాగా కనెక్ట్ అయ్యాడు.  ఇక తమిళ్ లో సూర్య చేసిన ప్రతి చిత్రం తెలుగు లో కూడా రిలీజ్ కావడంతో తెలుగు హీరోలతో మంచి పరిచయం పెరిగింది. అంతే కాదు ఆ మద్య హుదూద్ తుఫాన్ బాధితుల కోసం నలభై లక్షలు విరాళం ఇవ్వడంతో తెలుగు వారంటే ఎంత అభిమానమో తెలిసింది.  సూర్యా సినిమాలు తెలుగులో మంచి విజయాలు కూడా సాధిస్తూ కలెక్షన్లు బాగానే రాబట్టుతున్నాయి.
Related image
విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్న సూర్య.. న‌టుడు శివ కుమార్ త‌న‌యుడు అన్న సంగ‌తి తెలిసిందే. సూర్య సోద‌రుడు కార్తీ, భార్య జ్యోతిక కూడా ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కు హృదయాలు గెల్చుకున్నవారే. ఈ మద్య సూర్య కుటుంబం నుంచి  ‘మిస్టర్‌ చంద్రమౌళి’ చిత్రం ద్వారా సూర్య సోదరి బృందా గాయనిగా పరిచయం అయింది.
Image result for hero surya getaps
అయితే ప‌లు భాష‌ల‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సూర్య‌పై ఓ అభిమాని చూపించిన ప్రేమ అనీర్వచనీయం అంటున్నారు నెటిజ‌న్స్‌.ఓ అభిమాని సూర్య‌కి సంబంధించి 24 గెటప్స్‌ని పెన్సిల్‌తో వేసి వాటిని వీడియోగా రూపొందించి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది నా క‌ల‌ల ప్రాజెక్ట్‌. ఇది పూర్తి చేయ‌డానికి వారం ప‌ట్టింది. సూర్య గారు, ఈ వీడియో మీకు న‌చ్చుతుంద‌నుకుంటా.

మీకు న‌చ్చితే ఈ వీడియోకి కామెంట్ పెట్టండి అంటూ ట్వీట్ ద్వారా తెలియ‌జేశాడు సూర్య అభిమాని మిర్ష‌ద్‌.  ప్రస్తుతం సూర్య త‌న 36వ చిత్రంగా సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌జీకే అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. డ్రీమ్ వారియర్ ఫిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: