టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించే క్లాసిక్ మూవీ అంటూ ప్రశంసలు అందుకుంటున్న ‘మహానటి’ మూవీకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ కు విపరీతమైన పేరు వస్తోంది. అయితే ఈసినిమాను చూసిన విమర్శకులు ఇప్పుడిప్పుడే ఆమూవీ మ్యానియా నుండి బయటకు వచ్చి ‘మహానటి’ మూవీ విషయంలో నాగ్ అశ్విన్ చేసిన పొరపాట్లను బయటపెడుతున్నారు.
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
సావిత్రి చివరి దశలో ఆర్ధిక సమస్యలలో చిక్కుకోవడంతో చివరి దశలో చిన్నచిన్న పాత్రలతో కూడిన సినిమాలు చేస్తూ కాలం గడిపింది. అటువంటి పరిస్థుతులలో సావిత్రి నటించిన ‘గోరింటాకు’ మూవీ 1980 ప్రాంతంలో వచ్చిన మూవీ. ఈసినిమాలో అలనాటి హీరో శోభన్ బాబుకు తల్లిగా సావిత్రి నటించింది. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఆసినిమా షూటింగ్ విషయంలో సావిత్రిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని అదేవిధంగా ఆమెకు కూర్చోవడానికి సరైన కుర్చీ కూడ ఇవ్వలేదని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సంఘటనను దర్శకుడు నాగ్ అశ్విన్ యధాతధంగా ‘మహానటి’ సినిమాలో చూపెడుతూ అక్కడ ఎస్వీ రంగారావును చూపెట్టడం విమర్శకులకు షాక్ ఇస్తోంది. ఈమూవీలో మోహన్ బాబుని ఎస్వీ రంగారావు గారి పాత్రలో చూపెట్టిన నాగ్ అశ్విన్ ‘గోరింటాకు’ ప్రొడక్షన్ టీమ్ సావిత్రిని పట్టించుకోకుండా ఉండడం కనీసం ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేయకపోవడం ఎస్వీఆర్ దృష్టికి రావడంతో వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెకు తన లంచ్ ని సావిత్రికి స్వయంగా వడ్డిస్తాడు. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘మహానటి’ సినిమాకు ఈ సీన్ హైలెట్ గా మారింది. అయితే వాస్తవానికి 1974లో చనిపోయిన ఎస్వీ రంగారావు 1980 ప్రాంతంలో వచ్చిన ‘గోరింటాకు’ సెట్స్ పైకి ఎలా వచ్చాడు అంటూ విమర్శకులు నాగ్ అశ్విన్ పై సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు ఈమూవీ స్క్రిప్ట్ విషయంలో నాగ్ అశ్విన్ మరింత శ్రద్ధపెడితే ఈసినిమా మరింత బాగుండేది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: