బాలీవుడ్‌లో చాలా ఏళ్లపాటు చిన్నా చితకా పాత్రలు వేసి ప్రస్తుతం స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ కంగనా రౌనత్. అప్పట్లో బాలీవుడ్‌లో పెద్దగా డిమాండ్ లేకపోవడంతో సౌత్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  ఈ నేపథ్యంలో తెలుగు లో పూరిజగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఏక్ నిరంజగన్’ లో నటించింది. తర్వాత తెలుగు , తమిళంలో ఈ అమ్మడికి ఏ చాన్స్ రాలేదు. 

ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంగనా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ చిత్రంలో నటిస్తుంది. చారిత్రక నేపథ్యం కలిగిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' రూపుదిద్దుకుంది.  త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ చేయబోతున్నారు. 

తాజాగా బాలీవుడ్ న‌టి కంగనా రౌన‌త్‌కు ఈ సారి కేన్స్ ఫిల్మ్  ఫెస్టివ‌ల్ ఫ్రాన్స్‌లో పాల్గొనే అవ‌కాశం వ‌చ్చింది. ఈ  అవకాశాన్ని కంగ‌న  ఏమాత్రం వదులుకోలేదు. అంతర్జాతీయ వేదికపై అందంగా మెరిసిపోయింది.

లేటెస్ట్‌గా ఈమె ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలో నాచు క‌ల‌ర్ ఫ్యాంట్ ..లైట్ క‌ల‌ర్ ష‌ర్ట్‌లో త‌ళుకుమంది. ముదురు రంగు లిప్‌స్టిక్ వేసుకుని ..ఎద అందాల‌ను ఎదేచ్చ‌గా వ‌దిలేసింది ఈ భామ‌.  ప్రస్తుతం కంగనా కి సంబంధించిన ఈ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: