దర్శకులు నాగ్ అశ్విన్ తీసిన ‘మహానటి’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.  రాంచరణ్ ‘రంగస్థలం’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్’ లాంటి చిత్రాలతో పోటీ పడుతూ అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు..కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతన నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు.  ఇక మహానటి సావిత్రికి ఆ బిరుదు ఎలా వచ్చిందో తెలియాలంటే ఆమె జీవత కథ గురించి తెలుసుకోవాలి. 

సావిత్రి డిసెంబర్ 6, 1936లో తెనాలి దగ్గరలోని చిర్రావూరు లో జన్మించింది . చిన్నప్పుడే నాట్యం నేర్చుకుంది . నాటకాల్లో కూడా వేషాలు వేసింది . 1950లో 14వ ఏట సంసారం చిత్రంలో ఎల్వి ప్రసాద్ పరిచయం చేశాడు.  అంతకు ముందు 1948లో సావిత్రిని ఆమెపెద్ద తండ్రి వెంకట్రామయ్య చౌదరి సావిత్రిని మద్రాస్ తీసుకు వచ్చాడు.  ఎన్నో స్టూడియోలు తిరుగుతూ..చిన్న పాత్ర కోసం నానా కష్టాలు పడ్డారు.  ఆ సమయంలో సావిత్రికి జెమినీ గణేషన్ పరిచయం అయ్యారు. ఆ సమయంలో సావిత్రికి జెమినీ గణేషన్ ఎంతో సహాయపడ్డారు..ఆ పరిచయం వారి మద్య ప్రేమకు దారి తీసింది. 
Image result for savitri mahanati award
సావిత్రికి 16వ యేటనే జెమినీ గణేషన్ తో వివాహం జరిగింది. అప్పటికే అతనికి పెళ్లయ్యింది..పుష్పవల్లి అనే మరో నటితో సంబంధం పెట్టుకున్నాడు ( హిందీ నటి రేఖ తల్లి ) అయినా సావిత్రి అతన్నే కోరుకుంది , పెళ్లి చేసుకుంది. హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంటున్న సావిత్రికి పూజాఫలం , మూగమనసులు , డాక్టర్ చక్రవర్తి చిత్రాల్లో నటించింది . ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన మూగ మనసులు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చింది. ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సావిత్రి ,జెమినీ గణేషన్ దంపతులను ఆంధ్ర యువతీ మండలి, ఆంధ్ర మహిళా సభ వీరి ఇద్దరికీ ఘన సన్మాన సభ ఏర్పాటు చేశారు .
Image result for savitri mahanati award
ఈ సందర్భంగా ఏనుగు అంబారిమీద దంపతులను ఊరేగించారు . ఈ సభలోనే సావిత్రికి “మహానటి ” బిరుదు ప్రదానం చేశారు . అప్పటినుంచి ఆమె మహానటిగా చీర కీర్తిని సంపాదించారు . 1981లో సావిత్రి చనిపోయింది.  దాదాపు 37 సంవత్సరాల తర్వాత ‘మహానటి’ చిత్రం రావడం..అలనాటి సావిత్రిని తమ కళ్ల ముందు చూసినంతగా సంతోసిస్తున్నారు అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: