తెలుగు ఇండస్ట్రీలో ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్.  తాజాగా ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’.. ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.  రేపు రామ్ పుట్టినరోజు కావడంతో.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఫస్టులుక్ ను వదిలారు.
Related image
హీరో రామ్.. అనుపమ పరమేశ్వరన్ ను ఫాలో అవుతున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఎస్వీసీ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంతో ఆకట్టుకున్న రామ్‌ మరోసారి ప్రేమకథతోనే రాబోతున్నట్లు స్పష్టమౌతోంది. సెప్టెంబర్‌లో హలో గురు ప్రేమకోసమే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ . 
Image result for hello guru prema kosame
సినిమా చూపిస్తా మామ , నేనులోకల్‌’ సినిమాలతో మంచి సక్సెస్‌ సాధించిన త్రినాథ్‌ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు. ‘ ఉన్నది ఒకటే జిందగీ’సినిమాతో రామ్ కు మ్యూజికల్ హిట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. హలో గురు ప్రేమ కోసమే చిత్రం లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: